Telugu Global
NEWS

గ్యాస్ ప్రభావిత ఇళ్లకు పోలీసుల తాళాలు

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన తర్వాత పుకార్ల షికార్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంతా సవ్యంగానే ఉందని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నా కొందరు స్థానికులను భయపెట్టేందుకు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా తోడవడంతో ఈ పుకార్లు మరింత ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. కొందరు ప్రభావిత గ్రామాల్లోని ప్రజలంతా బయటకు రావడంతో అక్కడి ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తన ఇంట్లో దొంగతనం జరిగిందని లక్ష రూపాయలు […]

గ్యాస్ ప్రభావిత ఇళ్లకు పోలీసుల తాళాలు
X

ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ దుర్ఘటన తర్వాత పుకార్ల షికార్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అంతా సవ్యంగానే ఉందని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నా కొందరు స్థానికులను భయపెట్టేందుకు లేనిపోని ప్రచారాలు చేస్తున్నారు. కొన్ని రాజకీయ పార్టీలు కూడా తోడవడంతో ఈ పుకార్లు మరింత ఎక్కువగా వ్యాపిస్తున్నాయి.

కొందరు ప్రభావిత గ్రామాల్లోని ప్రజలంతా బయటకు రావడంతో అక్కడి ఇళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయంటూ ప్రచారం మొదలుపెట్టారు.

ఒక వ్యక్తి మీడియా ముందుకు వచ్చి తన ఇంట్లో దొంగతనం జరిగిందని లక్ష రూపాయలు ఎత్తుకెళ్లారంటూ హడావుడి చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతడిని విచారించారు. ఇంటి వద్దకు తీసుకెళ్లి పరిశీలించారు. కానీ దొంగతనం జరిగిన ఆనవాళ్లు కనిపించలేదు. పోలీసులు గట్టిగా నిలదీయగా… సదరు వ్యక్తి నిజం ఒప్పుకున్నారు. తాను కావాలనే మీడియా ముందు దొంగతనం జరిగిందని చెప్పానని… అలా చెబితే తనకు ప్రభుత్వం లక్ష రూపాయలు ఇస్తుందని భావించానని ఒప్పుకున్నారు.

ఇలాంటి ప్రచారం నేపథ్యంలో పోలీసులు గ్రామాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రజలు లేకపోవడంతో ప్రతి ఇంటికి పోలీసులే తాళం వేసి… ఈ తాళాలను తమ వద్దే ఉంచుకుంటున్నారు. గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రజలు గ్రామాల్లోకి వచ్చిన తర్వాత తామే ప్రతి ఇంటికి వేసిన తాళం తీస్తామని పోలీసులు ప్రకటించారు.

First Published:  10 May 2020 10:31 PM GMT
Next Story