Telugu Global
Cinema & Entertainment

6 నిమిషాలకు 6 కోట్లు

లాక్ డౌన్ ముగిసిన వెంటనే ప్రభుత్వ అనుమతితో షూటింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ వెంటనే పుష్ప సినిమా కూడా సెట్స్ పైకి వస్తుంది. ఇప్పుడీ మూవీకి సంబంధించి 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒకటి 6 నిమిషాలు.. 6 కోట్లు. అవును.. పుష్ప సినిమాలో కేవలం 6 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. భారీ సినిమాలకు పెట్టింది పేరైన మైత్రీ మూవీ మేకర్స్ కు ఇదేమంత పెద్ద […]

6 నిమిషాలకు 6 కోట్లు
X

లాక్ డౌన్ ముగిసిన వెంటనే ప్రభుత్వ అనుమతితో షూటింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఆ వెంటనే పుష్ప సినిమా కూడా సెట్స్ పైకి వస్తుంది. ఇప్పుడీ మూవీకి సంబంధించి 2 ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒకటి 6 నిమిషాలు.. 6 కోట్లు.

అవును.. పుష్ప సినిమాలో కేవలం 6 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారట. భారీ సినిమాలకు పెట్టింది పేరైన మైత్రీ మూవీ మేకర్స్ కు ఇదేమంత పెద్ద సమస్య కాదు. పైగా బన్నీ సినిమా కాబట్టి.. 6 నిమిషాల కోసం 6 కోట్లు పెట్టడం సాధ్యమయ్యే విషయమే. గతంలో సాహో, సైరా లాంటి సినిమాలకు కూడా ఇలానే చిన్న ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చుపెట్టారు.

ఇక పుష్పకు సంబంధించి వైరల్ అవుతున్న మరో అంశం ఏంటంటే.. ఈ సినిమాను పూర్తిగా దేశీ నిపుణులతో తెరకెక్కిస్తారట. షూటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏ దశలో, ఏ విభాగంలో విదేశీ నిపుణుడు కనిపించకూడదనే రూల్ పెట్టుకున్నారట.

అలా పుష్ప సినిమాను వంద శాతం మేడిన్ ఇండియాగా మలచాలనే ప్రయత్నం జరుగుతోందట. ఈ రెండు ఎలిమెంట్స్ ఇప్పుడు పుష్పను మరోసారి హాట్ టాపిక్ గా మార్చేశాయి. అన్నట్టు ఈ సినిమా కోసం బన్నీ ఆల్రెడీ మేకోవర్ అయ్యాడు. ఈ లాక్ డౌన్ టైమ్ అతడికి ఇలా పనికొచ్చింది.

First Published:  11 May 2020 7:50 AM GMT
Next Story