Telugu Global
Cinema & Entertainment

మళ్లీ సినిమాల్లోకి అవికా గౌర్

కాస్టింగ్ కౌచ్ ప్రకటన చేసి టాలీవుడ్ కు దూరమైన అవికా గౌర్, మళ్లీ ఇప్పుడిప్పుడే తెలుగులో పుంజుకుంటోంది. రాజుగారి గది3తో రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు రెండు సినిమాలకు కమిట్ అయింది. వీటిలో ఒకటి చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రాబోతున్న సినిమా కాగా.. ఇంకొకటి రాజ్ తరుణ్ సరసన ఉంది. రాజ్ తరుణ్, అవికాది హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ లాంటి హిట్స్ వచ్చాయి. […]

మళ్లీ సినిమాల్లోకి అవికా గౌర్
X

కాస్టింగ్ కౌచ్ ప్రకటన చేసి టాలీవుడ్ కు దూరమైన అవికా గౌర్, మళ్లీ ఇప్పుడిప్పుడే తెలుగులో పుంజుకుంటోంది. రాజుగారి గది3తో రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు రెండు సినిమాలకు కమిట్ అయింది. వీటిలో ఒకటి చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా రాబోతున్న సినిమా కాగా.. ఇంకొకటి రాజ్ తరుణ్ సరసన ఉంది.

రాజ్ తరుణ్, అవికాది హిట్ కాంబినేషన్. గతంలో వీళ్లిద్దరి కాంబోలో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ లాంటి హిట్స్ వచ్చాయి. మళ్లీ ఇన్నేళ్లకు ఇద్దరూ కలిసి శ్రీనివాస్ గవిరెడ్డి అనే కొత్త దర్శకుడి సినిమాతో కలవబోతున్నారు.

అయితే రాజ్ తరుణ్ మూవీ కంటే ముందు కల్యాణ్ దేవ్ సినిమాకు కాల్షీట్లు కేటాయించింది అవికా. ప్రస్తుతం సూపర్ మచ్చి అనే సినిమా చేస్తున్నాడు కల్యాణ్ దేవ్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఓ రొమాంటిక్ కామెడీ స్టోరీ చేయబోతున్నాడు కల్యాణ్ దేవ్. అందులో హీరోయిన్ గా అవికాను తీసుకున్నారు. ఈ సినిమాతో పాటు రాజ్ తరుణ్ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతోంది ఈ చిన్నారి పెళ్లికూతురు.

First Published:  9 May 2020 12:00 AM GMT
Next Story