Telugu Global
Cinema & Entertainment

ఎంజాయ్ చేస్తున్న తమన్

తమన్ చేతిలో ఎప్పుడూ కనీసం 4 సినిమాలుంటాయి. తెలుగు, తమిళ భాషలతో సంబంధం లేకుండా బిజీగా ఉంటాడు ఈ కంపోజర్. దాదాపు రెండేళ్లుగా ఖాళీ సమయం అనేది తెలియకుండా గడిపేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు దాదాపు 50 రోజులుగా ఖాళీ అయిపోయాడు. ఈ టైమ్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నానంటున్నాడు తమన్. లాక్ డౌన్ టైమ్ కు చెన్నై చేరుకున్నాడు తమన్. అపార్ట్ మెంట్ లోనే అమ్మతో ఉంటున్నాడు. రోజూ పొద్దున్న లేవడం, అపార్ట్ మెంట్ లో […]

ఎంజాయ్ చేస్తున్న తమన్
X

తమన్ చేతిలో ఎప్పుడూ కనీసం 4 సినిమాలుంటాయి. తెలుగు, తమిళ భాషలతో సంబంధం లేకుండా బిజీగా ఉంటాడు ఈ కంపోజర్. దాదాపు రెండేళ్లుగా ఖాళీ సమయం అనేది తెలియకుండా గడిపేశాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు దాదాపు 50 రోజులుగా ఖాళీ అయిపోయాడు. ఈ టైమ్ ను చాలా ఎంజాయ్ చేస్తున్నానంటున్నాడు తమన్.

లాక్ డౌన్ టైమ్ కు చెన్నై చేరుకున్నాడు తమన్. అపార్ట్ మెంట్ లోనే అమ్మతో ఉంటున్నాడు. రోజూ పొద్దున్న లేవడం, అపార్ట్ మెంట్ లో పైన నెట్ కు వెళ్లి క్రికెట్ ఆడడం రొటీన్ అయిపోయిందట. ఇక బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత ఓ సినిమా, డిన్నర్ చేసిన తర్వాత మరో సినిమా చూస్తున్నాడట. మధ్యలో తను ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలకు సంబంధించి కంపోజిషన్స్ కు తుదిమెరుగులు దిద్దుతున్నాడట.

లాక్ డౌన్ లేకపోతే లెక్కప్రకారం త్రివిక్రమ్ తో కలిసి కొత్త సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చునేవాడట తమన్. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కోసం ట్యూన్స్ ఇచ్చేవాడట. కానీ లాక్ డౌన్ వల్ల ఆ పని జరగలేదని.. త్వరలోనే త్రివిక్రమ్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూర్చుంటానని చెబుతున్నాడు.

First Published:  7 May 2020 8:30 PM GMT
Next Story