Telugu Global
Cinema & Entertainment

మెడికల్‌షాప్‌లో మందు అమ్ముతున్నారా? వావ్...

లాక్‌డౌన్‌తో సినిమాలు ఆగిపోయాయి. సెలబ్రెటీలే కాదు… హీరోలు, హీరోయిన్లు ఇంటికి పరిమితమయ్యారు. తమకు నచ్చిన వంటలు చేస్తూ కొందరు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ కోసం కొత్త కొత్త వర్క్‌వుట్స్‌పై కొందరు దృష్టిపెట్టారు. ముంబైలో ఉన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌పై ఇప్పుడు ఓ న్యూస్ వైరల్‌ అవుతోంది. బాంద్రాలోని ఓ వైన్ షాప్ వద్ద రకుల్ అంటూ ఒక వీడియోను కొంత మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆమె చేతిలో మందు బాటిళ్లు ఉన్నాయని …  వైన్‌షాప్‌ లు తెరుచుకోవడంతో […]

మెడికల్‌షాప్‌లో మందు అమ్ముతున్నారా? వావ్...
X

లాక్‌డౌన్‌తో సినిమాలు ఆగిపోయాయి. సెలబ్రెటీలే కాదు… హీరోలు, హీరోయిన్లు ఇంటికి పరిమితమయ్యారు. తమకు నచ్చిన వంటలు చేస్తూ కొందరు ఎంజాయ్‌ చేస్తున్నారు. ఫిట్‌నెస్‌ కోసం కొత్త కొత్త వర్క్‌వుట్స్‌పై కొందరు దృష్టిపెట్టారు.

ముంబైలో ఉన్న రకుల్‌ ప్రీత్‌సింగ్‌పై ఇప్పుడు ఓ న్యూస్ వైరల్‌ అవుతోంది. బాంద్రాలోని ఓ వైన్ షాప్ వద్ద రకుల్ అంటూ ఒక వీడియోను కొంత మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఆమె చేతిలో మందు బాటిళ్లు ఉన్నాయని … వైన్‌షాప్‌ లు తెరుచుకోవడంతో లిక్కర్‌ బాటిళ్లు రకుల్‌ కొన్నదని కామెంట్లు పెడుతున్నారు.

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రకుల్‌ దృష్టికి కూడా ఈ ప్రచారం వెళ్లింది. దీంతో ఆమె స్పందించింది. మెడికల్‌షాప్‌లో మందు అమ్ముతున్నారా? వావ్‌ అంటూ సెటైర్‌ వేసింది. తాను మెడికల్‌షాప్‌కు వెళ్లి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేశానని ఆమె చెప్పకనే చెప్పింది. కావాలంటే వీడియో క్లియర్‌గా చూస్తే తెలిసిపోతుంది.

First Published:  8 May 2020 7:02 AM GMT
Next Story