Telugu Global
Cinema & Entertainment

చైతూతో కాంటాక్ట్ తగ్గించిన సుశాంత్

హీరో సుశాంత్ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా తన కాంపౌండ్ లో తను ఎవ్వరితో ఎక్కువగా క్లోజ్ గా ఉంటాననే విషయాన్ని బయటపెట్టాడు. అతడే నాగచైతన్య. “మా ఫ్యామిలీలో నేను నాగచైతన్యతో బాగా క్లోజ్ గా ఉంటాను. నా సీక్రెట్స్ అన్నీ చైతూతో షేర్ చేసుకుంటాను. మరీ ముఖ్యంగా మేమిద్దరం కలిసి ఒకేసారి యాక్టింగ్ నేర్చుకున్నాం. ముంబయిలో ఓ ఇల్లు తీసుకొని 5 నెలలు కలిసి ఉన్నాం. అప్పట్నుంచి మరింత క్లోజ్ అయిపోయాం. నా ప్రతి […]

చైతూతో కాంటాక్ట్ తగ్గించిన సుశాంత్
X

హీరో సుశాంత్ చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. మరీ ముఖ్యంగా తన కాంపౌండ్ లో తను ఎవ్వరితో ఎక్కువగా క్లోజ్ గా ఉంటాననే విషయాన్ని బయటపెట్టాడు. అతడే నాగచైతన్య.

“మా ఫ్యామిలీలో నేను నాగచైతన్యతో బాగా క్లోజ్ గా ఉంటాను. నా సీక్రెట్స్ అన్నీ చైతూతో షేర్ చేసుకుంటాను. మరీ ముఖ్యంగా మేమిద్దరం కలిసి ఒకేసారి యాక్టింగ్ నేర్చుకున్నాం. ముంబయిలో ఓ ఇల్లు తీసుకొని 5 నెలలు కలిసి ఉన్నాం. అప్పట్నుంచి మరింత క్లోజ్ అయిపోయాం. నా ప్రతి సీక్రెట్ చైతూకు తెలుసు.”

ఇలా నాగచైతన్యతో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు సుశాంత్. అయితే ఇప్పుడు అతడితో అంత క్లోజ్ గా ఉండడం లేదనే విషయాన్ని కూడా స్పష్టంచేశాడు. సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత నాగచైతన్యతో ఎక్కువగా టచ్ లోకి వెళ్లడం తగ్గించేశానని.. పెళ్లైన తర్వాత చైతూను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేక కాస్త దూరంగా ఉంటున్నానని అంటున్నాడు. సుశాంత్ నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమా త్వరలోనే థియేటర్లలోకి రాబోతోంది.

First Published:  7 May 2020 11:00 PM GMT
Next Story