Telugu Global
Cinema & Entertainment

ఈసారి బిగ్ బాస్-4 డౌటే

లెక్కప్రకారం ఈపాటికి బిగ్ బాస్ సందడి ప్రారంభమవ్వాలి. హౌజ్ లోకి ఎవరు వెళ్తున్నారంటూ చాలా పేర్లు మీడియాలో చక్కర్లు కొట్టాలి. కానీ అలాంటి సందడేం లేదు. ఇప్పుడున్న కరోనా కాలంలో హౌజ్ లోకి రమ్మని అడిగితే సెలబ్రిటీలు ఎవ్వరూ ఒప్పుకోరు. అందుకే బిగ్ బాస్ సీజన్-4ను వాయిదా వేసింది స్టార్ మా యాజమాన్యం. అవును.. వచ్చేనెల నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సీజన్ ను ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభించాలని భావిస్తోంది ఆ ఛానెల్. వ్యాఖ్యాతగా […]

ఈసారి బిగ్ బాస్-4 డౌటే
X

లెక్కప్రకారం ఈపాటికి బిగ్ బాస్ సందడి ప్రారంభమవ్వాలి. హౌజ్ లోకి ఎవరు వెళ్తున్నారంటూ చాలా పేర్లు మీడియాలో చక్కర్లు కొట్టాలి. కానీ అలాంటి సందడేం లేదు. ఇప్పుడున్న కరోనా కాలంలో హౌజ్ లోకి రమ్మని అడిగితే సెలబ్రిటీలు ఎవ్వరూ ఒప్పుకోరు. అందుకే బిగ్ బాస్ సీజన్-4ను వాయిదా వేసింది స్టార్ మా యాజమాన్యం.

అవును.. వచ్చేనెల నుంచి ప్రారంభం కావాల్సిన ఈ సీజన్ ను ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ప్రారంభించాలని భావిస్తోంది ఆ ఛానెల్. వ్యాఖ్యాతగా నాగార్జునను మరోసారి ఫిక్స్ చేసిన స్టార్ మా ఛానెల్.. పార్టిసిపెంట్స్ విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి వర్క్ స్టార్ట్ చేయలేదు.

బిగ్ బాస్ హౌజ్ లోకి సాధారణంగా 13 లేదా 14 మంది వెళ్తారు. వీళ్లు కాకుండ అదనంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతమందిని ఎంపిక చేయడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఛానెల్ కు ఆదాయం పూర్తిగా పడిపోయిన ఈ టైమ్ లో కంటెస్టెంట్స్ గా రాబోతున్న సెలబ్రిటీల గొంతెమ్మ కోర్కెలు తీర్చాలంటే అది ఛానెల్ కు తలకుమించిన భారంగా మారుతుంది. అందుకే ప్రస్తుతానికి బిగ్ బాస్ సీజన్-4ను నిరవథికంగా వాయిదా వేసింది యాజమాన్యం.

First Published:  8 May 2020 1:00 AM GMT
Next Story