Telugu Global
Cinema & Entertainment

కాజల్ కు మరో భారీ అవకాశం

ఇండస్ట్రీకొచ్చి 14 ఏళ్లు అవుతున్నా కాజల్ కు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అవి కూడా సాదాసీదా అవకాశాలు కావు. అన్నీ బడా సినిమాలే. ప్రస్తుతం ఆమె చేతిలో చిరంజీవి, కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోల సినిమాలున్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో బడా ఆఫర్ దక్కించుకుంది ఈ చందమామ. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే తమిళ హీరో విజయ్ సరసన మరోసారి నటించబోతోంది కాజల్. ఈ మేరకు చర్చలు షురూ అయ్యాయి. విజయ్ హీరోగా […]

కాజల్ కు మరో భారీ అవకాశం
X

ఇండస్ట్రీకొచ్చి 14 ఏళ్లు అవుతున్నా కాజల్ కు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అవి కూడా సాదాసీదా అవకాశాలు కావు. అన్నీ బడా సినిమాలే. ప్రస్తుతం ఆమె చేతిలో చిరంజీవి, కమల్ హాసన్ లాంటి పెద్ద హీరోల సినిమాలున్నాయి. ఇప్పుడు వీటికి తోడు మరో బడా ఆఫర్ దక్కించుకుంది ఈ చందమామ.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే తమిళ హీరో విజయ్ సరసన మరోసారి నటించబోతోంది కాజల్. ఈ మేరకు చర్చలు షురూ అయ్యాయి. విజయ్ హీరోగా తుపాకి సినిమాకు సీక్వెల్ తీద్దామని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు మురుగదాస్. తుపాకీలో కాజల్ హీరోయిన్ గా నటించింది. సో.. సీక్వెల్ లో కూడా ఆమెనే కొనసాగించాలి.

ఈ ప్రాజెక్టు కనుక ఫైనలైజ్ అయితే కాజల్ కు మరో బంపర్ ఆఫర్ దక్కినట్టే అనుకోవాలి. ఎందుకంటే విజయ్ సరసన అవకాశం కోసం చాలామంది హీరోయిన్లు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో కాజల్ కు ఆ ఛాన్స్ అనుకోకుండా దక్కింది.

ప్రస్తుతం మాస్టర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్. ఇది కంప్లీట్ అయిన వెంటనే మురుగదాస్ తో కథాచర్చలు మొదలవుతుంది. ప్రాజెక్టు ఓకే అయితే వెంటనే కాజల్ ను సంప్రదిస్తారు.

First Published:  5 May 2020 9:00 PM GMT
Next Story