Telugu Global
National

ఏపీలో భారీగా కరోనా బాధితుల రికవరీ...

ఏపీలో కరోనా బాధితులు భారీగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరొనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కృష్ణా జిల్లాలో 61 మంది, కర్నూలులో 39 మంది, చిత్తూరు జిల్లాలో 20 మంది, అనంతపురంలో 10 మంది, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా […]

ఏపీలో భారీగా కరోనా బాధితుల రికవరీ...
X

ఏపీలో కరోనా బాధితులు భారీగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరొనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 24 గంటల్లో 140 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

కృష్ణా జిల్లాలో 61 మంది, కర్నూలులో 39 మంది, చిత్తూరు జిల్లాలో 20 మంది, అనంతపురంలో 10 మంది, తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు, ప్రకాశం జిల్లాలో ఇద్దరు డిశ్చార్జ్ అయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు, గుంటూరు, కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

ఇప్పటి వరకు ఏపీలో 729 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారు. దేశ సగటు కంటే ఏపీలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 7వేల 782 మందికి పరీక్షలు నిర్వహించగా… వారిలో 60 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

వైద్య పరీక్షల్లో ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు లక్షా 41వేల 272 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 1,777 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 729 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… ప్రస్తుతం 1,012 మంది చికిత్స పొందుతున్నారు.

First Published:  6 May 2020 3:51 AM GMT
Next Story