Telugu Global
National

తమిళనాడులో ఒక్కసారిగా కరోనా సంఖ్య జంప్

తమిళనాడులో కరోనా భారీగా విస్తరిస్తోంది. సోమవారం ఒక్కరోజు 527 కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ఉలిక్కిపడింది. సోమవారం నమోదైన 527 కేసుల్లో 266 కేసులు ఒక్క చెన్నైలోనే వెలుగు చూశాయి. 122 కేసులు కడలూరులో బయటపడ్డాయి. ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న చెన్నైలోని కోయంబేడు హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ నుంచే అత్యధిక కరోనా కేసులు బయటపడ్డాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 400 వరకు కోయంబేడులో పనిచేసిన కార్మికులు, వారిని కలిసి వారివే. వందల సంఖ్యలో కరోనా కేసులు […]

తమిళనాడులో ఒక్కసారిగా కరోనా సంఖ్య జంప్
X

తమిళనాడులో కరోనా భారీగా విస్తరిస్తోంది. సోమవారం ఒక్కరోజు 527 కేసులు నమోదయ్యాయి. దీంతో తమిళనాడు ఉలిక్కిపడింది. సోమవారం నమోదైన 527 కేసుల్లో 266 కేసులు ఒక్క చెన్నైలోనే వెలుగు చూశాయి. 122 కేసులు కడలూరులో బయటపడ్డాయి.

ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్‌గా పేరున్న చెన్నైలోని కోయంబేడు హోల్‌సేల్‌ కూరగాయల మార్కెట్‌ నుంచే అత్యధిక కరోనా కేసులు బయటపడ్డాయి. కొత్తగా నమోదైన కేసుల్లో 400 వరకు కోయంబేడులో పనిచేసిన కార్మికులు, వారిని కలిసి వారివే.

వందల సంఖ్యలో కరోనా కేసులు బయటపడడంతో కోయంబేడు మార్కెట్‌ను మూసివేశారు. ఈ మార్కెట్‌కు వచ్చిన వారిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఇక్కడి నుంచి స్వగ్రామాలకు వెళ్లిన 6వేల 984 మందిని గుర్తించారు. ఈ వేలాది మందిలో పలు జిల్లాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు. దాంతో కరోనా వ్యాప్తిపై తమిళనాడు ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

తమిళనాడులో ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న రాష్ట్రంగా నాలుగో స్థానంలో ఉంది. తమిళనాడులో మొత్తం 3వేల 550 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

First Published:  5 May 2020 2:21 AM GMT
Next Story