Telugu Global
Cinema & Entertainment

హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న నితిన్

తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడం నితిన్ కు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రతి హీరోయిన్ తో రెండేసి సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు ఉంది ఈ హీరోకి. ఇప్పుడా లిస్ట్ చెప్పుకుంటే చాలా పెద్దదౌతుంది. రీసెంట్ గా చూసుకుంటే మేఘా ఆకాష్ ను అలా రిపీట్ చేశాడు నితిన్. లై సినిమా చేసిన వెంటనే ఆమెతో ఛల్ మోహనరంగ మూవీ చేశాడు. ఇప్పుడు అదే టైపులో కీర్తిసురేష్ ను కూడా రిపీట్ చేయబోతున్నాడు […]

హీరోయిన్ ను రిపీట్ చేస్తున్న నితిన్
X

తన సినిమాల్లో హీరోయిన్లను రిపీట్ చేయడం నితిన్ కు కొత్త కాదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి ప్రతి హీరోయిన్ తో రెండేసి సినిమాలు చేసిన ట్రాక్ రికార్డు ఉంది ఈ హీరోకి. ఇప్పుడా లిస్ట్ చెప్పుకుంటే చాలా పెద్దదౌతుంది. రీసెంట్ గా చూసుకుంటే మేఘా ఆకాష్ ను అలా రిపీట్ చేశాడు నితిన్. లై సినిమా చేసిన వెంటనే ఆమెతో ఛల్ మోహనరంగ మూవీ చేశాడు. ఇప్పుడు అదే టైపులో కీర్తిసురేష్ ను కూడా రిపీట్ చేయబోతున్నాడు ఈ హీరో.

త్వరలోనే కృష్ణచైతన్య దర్శకత్వంలో పవర్ పేట అనే సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు నితిన్. చాన్నాళ్లుగా అనుకుంటున్న ఈ సబ్జెక్ట్ ను తాజాగా ఓకే చేశాడు. ఇందులో హీరోయిన్ గా మరోసారి కీర్తిసురేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న రంగ్ దే సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే పవర్ పేటలో కూడా ఆమెనే హీరోయిన్.

అయితే నితిన్-కీర్తి కాంబినేషన్ మరోసారి తెరపైకి రావడానికి చాలా టైమ్ పడుతుంది. ఎఁదుకంటే రంగ్ దే పూర్తయిన తర్వాత.. చంద్రశేఖర్ ఏలేటి సినిమా కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత అంథాదున్ రీమేక్ ను పూర్తిచేయాలి. ఈ 3 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే పవర్ పేట సెట్స్ పైకి వస్తుంది.

First Published:  4 May 2020 10:00 PM GMT
Next Story