మధ్యప్రదేశ్ లో వలస కార్మికులకు బాత్‌రూంలో క్వారంటైన్
మధ్యప్రదేశ్‌లో క్వారంటైన్ సదుపాయాలపై పెద్దెత్తున విమర్శలు వస్తున్నాయి. వలస కూలీ దంపతులకు బాత్‌రూంలో క్వారంటైన్ కల్పించిన ఫొటోలు బయటకు రావడంతో దుమారం రేగింది. వలస కార్మికుల కోసం ఒక స్కూల్ వద్ద క్వారంటైన్ ఏర్పాటు చేశారు. ఇద్దరు దంపతులకు బాత్‌రూంలో వసతి కల్పించినట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. బాబాత్‌రూంలో దంపతులు ఉండగా అక్కడే తాగేందుకు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో దుమారం రేగింది. వెంటనే అధికారులు వారిని స్కూల్‌లోని మరో […]

మధ్యప్రదేశ్‌లో క్వారంటైన్ సదుపాయాలపై పెద్దెత్తున విమర్శలు వస్తున్నాయి. వలస కూలీ దంపతులకు బాత్‌రూంలో క్వారంటైన్ కల్పించిన ఫొటోలు బయటకు రావడంతో దుమారం రేగింది.
వలస కార్మికుల కోసం ఒక స్కూల్ వద్ద క్వారంటైన్ ఏర్పాటు చేశారు. ఇద్దరు దంపతులకు బాత్‌రూంలో వసతి కల్పించినట్టు ఫొటోలు బయటకు వచ్చాయి. బాబాత్‌రూంలో దంపతులు ఉండగా అక్కడే తాగేందుకు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు బయటకు రావడంతో దుమారం రేగింది. వెంటనే అధికారులు వారిని స్కూల్‌లోని మరో గదికి తరలించారు.
ఈ ఘటనపై గుణ జిల్లా కలెక్టర్ విశ్వనాథ్ స్పందించారు. ఒక వ్యక్తి మద్యం మత్తులో బాత్‌రూంలో ఉండగా… అతడి భార్య ఆహారం అందించిందని… ఈ ఫొటో కావాలని వైరల్ చేశారని కలెక్టర్ వివరించారు. అయితే ఈ వార్త వైరల్ అయిన సమయంలో మద్యం అమ్మకాలపై దేశవ్యాప్తంగా నిషేధం ఉండడం, బాత్రూమ్ లో వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అన్ని వస్తువులూ ఉండడంతో కలెక్టర్ మాటలను నెటిజన్ లు విశ్వసించడం లేదు. ఈ అంశంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
అక్కడ ఉన్న వారు మాత్రం దంపతులకు బాత్‌రూంలో క్వారంటైన్ చేసింది నిజమేనని చెబుతున్నారు. విషయం బయటకు రావడం, తీవ్ర స్థాయిలో దుమారం రేగడంతో వారిని స్కూల్ గదికి తీసుకెళ్లారని మీడియాకు వివరించారు.