Telugu Global
National

లిక్కర్‌పై కరోనా సెస్... తొలి రోజు జోరుగా అమ్మకాలు

లాక్‌డౌన్‌లో లిక్కర్‌ సేల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. ఢిల్లీ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. తొలి రోజు మద్యం అమ్మకాల తర్వాత ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలపై కొత్త పన్ను విధించింది. స్పెషల్ కరోనా ఫీజు పేరుతో 70 శాతం అదనపు ధర వసూలు చేయనుంది. గరిష్ట అమ్మకపు ధరకంటే 70 శాతం అదనపు ధర వసూలు […]

లిక్కర్‌పై కరోనా సెస్... తొలి రోజు జోరుగా అమ్మకాలు
X

లాక్‌డౌన్‌లో లిక్కర్‌ సేల్స్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. ఢిల్లీ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి.

తొలి రోజు మద్యం అమ్మకాల తర్వాత ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం అమ్మకాలపై కొత్త పన్ను విధించింది. స్పెషల్ కరోనా ఫీజు పేరుతో 70 శాతం అదనపు ధర వసూలు చేయనుంది. గరిష్ట అమ్మకపు ధరకంటే 70 శాతం అదనపు ధర వసూలు చేయాలని నిర్ణయించింది. కరోనాతో ఆర్ధికంగా జరిగిన నష్టాన్ని మద్యం అమ్మకాలపై కరోనా సెస్‌తో పూడ్చుకోవాలని అక్కడి ప్రభుత్వం చూస్తోంది.

కర్నాటకలో తొలిరోజు జోరుగా లిక్కర్‌ సేల్స్‌ నడిచాయి. మద్యం కోసం వైన్‌షాపుల ఎదుట జనం బారులు తీరారు. బెంగళూరులో మహిళలు కూడా లైన్‌లో నిల్చున్నారు. మొదటి రోజు 45 కోట్ల రూపాయల సేల్స్‌ జరిగినట్లు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. 3.9 లక్షల లీటర్ల బీరు, 8 లక్షల లీటర్ల విస్కీ సేల్‌ అయినట్లు తెలిపారు.

ఏపీలో తొలి రోజు 40 కోట్ల మందు అమ్ముడుపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఉదయం నుంచే మద్యం కొనుగోలు కోసం కిలోమీటర్ల మేర బారులు తీరారు. అయితే మంగళవారం నుంచి భౌతిక దూరం పాటించకపోతే మద్యం షాపులు మూసి వేసి… జనం కంట్రోల్‌కు వచ్చిన తర్వాతే తెరవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాస్క్‌లు ధరించడంతో పాటు షాపు దగ్గర ఐదుగురు మాత్రమే ఉండేలా చూడాలని సూచించారు.

మరోవైపు వైన్‌షాపుల్లో పూర్తిగా లిక్కర్‌ అమ్ముడుపోయింది. కొన్ని షాపుల దగ్గర నో స్టాక్‌ బోర్డు పెట్టారు. రేపు స్టాక్‌ వస్తేనే షాపు తెరుస్తామని బోర్డు పెట్టారు. మద్యంపై 25 శాతం ధరలు పెంచడంతో 40 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు అబ్కారీ శాఖ లెక్కలు వేసింది.

First Published:  4 May 2020 8:41 PM GMT
Next Story