ఏపీలో మరోసారి మద్యం ధరల పెంపు
ఏపీ ప్రభుత్వం మద్యం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా ధరలు పెంచింది. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన షాపులు సోమవారం తెరుచుకోగా…. 25 శాతం ధరలు పెంచి అమ్మకాలు సాగించారు. సోమవారం ఒక్కరోజే దాదాపు 40 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి. మద్యం కోసం భారీ సంఖ్యలో మద్యంబాబులు తరలిరావడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేసింది. 25 శాతం ధరలు పెంచినా సరే లెక్కచేయకుండా కొనుగోళ్ల కోసం ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో మద్యం […]
ఏపీ ప్రభుత్వం మద్యం విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరోసారి భారీగా ధరలు పెంచింది. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన షాపులు సోమవారం తెరుచుకోగా…. 25 శాతం ధరలు పెంచి అమ్మకాలు సాగించారు. సోమవారం ఒక్కరోజే దాదాపు 40 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి.
మద్యం కోసం భారీ సంఖ్యలో మద్యంబాబులు తరలిరావడం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేసింది. 25 శాతం ధరలు పెంచినా సరే లెక్కచేయకుండా కొనుగోళ్ల కోసం ఎగబడ్డారు. ఈ నేపథ్యంలో మద్యం ధరలను మరో 50 శాతం పెంచింది ప్రభుత్వం.
దీంతో లాక్‌డౌన్ ముందు ధరలతో పోలిస్తే ఇప్పుడు మద్యం ధరలు 75శాతం పెరిగినట్టు అయింది. ఈ పెరిగిన ధరలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమలులో ఉంటాయి. మద్యం ధరల పెంపు వివరాలను స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్ వెల్లడించారు.
షాపుల సంఖ్యనూ గణనీయంగా తగ్గించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెలాఖరులోగా మరో 15 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో 4,384 మద్యం షాపులు ఉండగా… జగన్ ప్రభుత్వం రాగానే 20 శాతం షాపులను తగ్గించింది. ప్రస్తుతం ఏపీలో 3వేల 500 మద్యం షాపులు మాత్రమే ఉన్నాయి. ఈ నెలాఖరులో వాటిలో మరో 15 శాతం షాపులను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యాన్ని కట్టడి చేసేందుకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.