Telugu Global
National

కేరళలో కరోనా కంట్రోల్‌ " 48 గంటల్లో జీరో కేసులు

కేరళలో కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. ఆదివారం, సోమవారం ఒక్క కేసు కూడా పాజిటివ్‌ రాకపోవడంతో అక్కడ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు రోజుల్లో జరిపిన పరీక్షలు నెగెటివ్‌ వచ్చాయి. కేరళలో ఇప్పటివరకూ 499 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఇప్పటి వరకూ 462 మంది కోలుకున్నారు. సోమవారం 61 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 34 మంది మాత్రమే ఆసుపత్రుల్లో […]

కేరళలో కరోనా కంట్రోల్‌  48 గంటల్లో జీరో కేసులు
X

కేరళలో కరోనా కంట్రోల్‌లోకి వచ్చింది. రాష్ట్రంలో వరుసగా రెండో రోజూ ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాలేదు. ఆదివారం, సోమవారం ఒక్క కేసు కూడా పాజిటివ్‌ రాకపోవడంతో అక్కడ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. రెండు రోజుల్లో జరిపిన పరీక్షలు నెగెటివ్‌ వచ్చాయి.

కేరళలో ఇప్పటివరకూ 499 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీరిలో ఇప్పటి వరకూ 462 మంది కోలుకున్నారు. సోమవారం 61 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 34 మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కన్నూరు జిల్లాలో 19 మంది, కొట్టాయం జిల్లాలో 12 మంది, ఇడుక్కిలో 11, కొల్లంలో 9 మంది కొజికోడ్‌లో నలుగురు, తిరువనంతపురం, కసర్‌గడ్‌లో ఇద్దరు చొప్పున ఆసుపత్రిలో ఉన్నారు.

ప్రస్తుతానికి 21,724 మంది పరిశీలనలో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. వీరిలో 372 మంది ఆసుపత్రిలో క్వారంటైన్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. ఇప్పటివరకూ 33వేల 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే… 32 వేల 315 మందికి నెగటివ్‌ వచ్చింది. ప్రస్తుతానికి కేరళలో 84 హాట్‌ స్పాట్‌లు కొనసాగుతున్నాయి.

కేరళలో కరోనా కంట్రోల్ లోకి రావడంతో ఇప్పుడు అందరూ అదే మోడల్‌ ను ఫాలో కాబోతున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించారు. అయితే మద్యం దుకాణాలు తెరిచేందుకు మాత్రం అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

First Published:  4 May 2020 8:18 PM GMT
Next Story