Telugu Global
NEWS

నరసరావుపేటలో ప్రత్యేక ఆపరేషన్‌

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న పట్టణంగా గుంటూరు జిల్లాలోని నరసరావు పేట నిలుస్తోంది. పేటలో ఇప్పటికే 161 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఒక్క సోమవారమే కొత్తగా 13 కేసులు వచ్చాయి. దాంతో యంత్రాంగం అప్రమత్తమైంది. నరసరావుపేటలో కరోనా కట్టడికి ప్రత్యేక ఆపరేషన్‌ మొదలుపెట్టారు. మే 15 నాటికి కొత్తగా కేసులు నమోదు కాకుండా చేయడమే లక్ష్యంగా ” మిషన్‌ మే 15” అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఆపరేషన్ బాధ్యతలను సబ్‌ […]

నరసరావుపేటలో ప్రత్యేక ఆపరేషన్‌
X

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్న పట్టణంగా గుంటూరు జిల్లాలోని నరసరావు పేట నిలుస్తోంది. పేటలో ఇప్పటికే 161 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వాటిలో ఒక్క సోమవారమే కొత్తగా 13 కేసులు వచ్చాయి. దాంతో యంత్రాంగం అప్రమత్తమైంది. నరసరావుపేటలో కరోనా కట్టడికి ప్రత్యేక ఆపరేషన్‌ మొదలుపెట్టారు. మే 15 నాటికి కొత్తగా కేసులు నమోదు కాకుండా చేయడమే లక్ష్యంగా ” మిషన్‌ మే 15” అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఆపరేషన్ బాధ్యతలను సబ్‌ కలెక్టర్ దినేష్‌ కుమార్‌కు అప్పగించారు.

రానున్న మూడు రోజుల్లో పట్టణంలో సంపూర్ణ లాక్‌డౌన్ అమలు చేయనున్నారు. పేట కరోనా హాట్‌స్పాట్‌గా మారిన నేపథ్యంలో ఇక్కడ భారీగా కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో పరిస్థితిపై సమీక్షించారు.

నరసరావుపేటలో కరోనా లక్షణాలున్న వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. లాక్‌డౌన్‌ను ఇక్కడ మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఒక్క నరసరావుపేటలోనే 3వేల 500 కరోనా పరీక్షలు నిర్వహించారు. మే 15 నాటికి జీరో కేసులే లక్ష్యంగా పనిచేస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

First Published:  5 May 2020 12:16 AM GMT
Next Story