వాచ్‌మెన్‌పై దాడి చేసిన మద్యం దుకాణ ఉద్యోగులు... ఆత్మహత్య
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో విషాదం చోటు చేసుకుంది. కూచిపూడి గ్రామంలో మద్యం షాపు వాచ్‌మెన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలించేందుకు ప్రయత్నించగా వాచ్‌మెన్ అడ్డుకున్నాడు. దాంతో వారు వాచ్‌మెన్‌పై దాడి చేసి కొట్టారు. దాడితో మనస్థాపం చెందిన వాచ్‌మెన్ కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. షాపు నుంచి అక్రమంగా మద్యంను తరలించేందుకు ప్రయత్నించింది మద్యం షాపులో పనిచేసే ఉద్యోగులేనని స్థానికులు చెబుతున్నారు. ఉద్యోగులు కొట్టడం వల్లే కోటేశ్వరరావు […]
కృష్ణా జిల్లా మొవ్వ మండలంలో విషాదం చోటు చేసుకుంది. కూచిపూడి గ్రామంలో మద్యం షాపు వాచ్‌మెన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. రాత్రి కొందరు వ్యక్తులు అక్రమంగా మద్యం తరలించేందుకు ప్రయత్నించగా వాచ్‌మెన్ అడ్డుకున్నాడు. దాంతో వారు వాచ్‌మెన్‌పై దాడి చేసి కొట్టారు.
దాడితో మనస్థాపం చెందిన వాచ్‌మెన్ కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు చెబుతున్నారు. షాపు నుంచి అక్రమంగా మద్యంను తరలించేందుకు ప్రయత్నించింది మద్యం షాపులో పనిచేసే ఉద్యోగులేనని స్థానికులు చెబుతున్నారు. ఉద్యోగులు కొట్టడం వల్లే కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తున్నారు.
చనిపోయిన కోటేశ్వరరావు గతంలో ఎంపీటీసీగా కూడా పనిచేశారు. కోటేశ్వరరావు ఆత్మహత్యకు కారణమైన మద్యం దుకాణ ఉద్యోగులను అరెస్ట్ చేయాలని అతడి బంధువులు, కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.