Telugu Global
Cinema & Entertainment

ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. లెక్కప్రకారం ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేయాలి. కానీ ఇప్పుడా ప్లానింగ్ మారింది. శివ నిర్వాణ కంటే ముందు మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు దేవరకొండ. అవును.. పూరి జగన్నాధ్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వర్క్ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అయిన తర్వాత కెరీర్ విషయంలో చాలా ఫోకస్ గా […]

ప్లాన్ మార్చిన విజయ్ దేవరకొండ
X

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. లెక్కప్రకారం ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ మూవీ చేయాలి. కానీ ఇప్పుడా ప్లానింగ్ మారింది. శివ నిర్వాణ కంటే ముందు మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు దేవరకొండ.

అవును.. పూరి జగన్నాధ్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వర్క్ చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ అయిన తర్వాత కెరీర్ విషయంలో చాలా ఫోకస్ గా ఉంటున్నాడు ఈ హీరో. ఆచితూచి ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే శివ నిర్వాణ సినిమాను కాస్త వెనక్కి పెట్టినట్టు తెలుస్తోంది.

నిజానికి దేవరకొండకు ఈ ఐడియా ఇచ్చిన వ్యక్తి దిల్ రాజు. శివ నిర్వాణ సినిమాను దిల్ రాజు బ్యానర్ లోనే చేయాలి విజయ్ దేవరకొండ. కానీ శివ నిర్వాణ కంటే ముందు ఇంద్రగంటితో సినిమా చేస్తే బాగుంటుందని దేవరకొండకు సలహా ఇచ్చాడు దిల్ రాజు. అలా ఈ ప్రాజెక్ట్ సెట్ అయింది.

First Published:  4 May 2020 10:00 AM GMT
Next Story