Telugu Global
NEWS

కేసీఆర్ తీరు అన్‌ సైంటిఫిక్‌... కరోనా పరీక్షలు నిర్వహించాలి, చావులకు కారణాలు తేల్చాలి

తెలంగాణలో కరోనా నివారణ చర్యలపై అనేక అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు భారీగా పరీక్షలు నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకుభిన్నంగా వ్యవహరిస్తుండడంతో దాని పరిణామాలు ఎలా ఉంటాయో అన్న దానిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఫ్రీ స్టేట్ అని చెబుతున్న ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి ఎందుకు ముందుకురావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కూడా ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. […]

కేసీఆర్ తీరు అన్‌ సైంటిఫిక్‌... కరోనా పరీక్షలు నిర్వహించాలి, చావులకు కారణాలు తేల్చాలి
X

తెలంగాణలో కరోనా నివారణ చర్యలపై అనేక అనుమానాలను ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాలు భారీగా పరీక్షలు నిర్వహిస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం అందుకుభిన్నంగా వ్యవహరిస్తుండడంతో దాని పరిణామాలు ఎలా ఉంటాయో అన్న దానిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా ఫ్రీ స్టేట్ అని చెబుతున్న ప్రభుత్వం పరీక్షలు నిర్వహించడానికి ఎందుకు ముందుకురావడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి కూడా ప్రభుత్వ తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్‌లో రైతుల సమస్యలు, కరోనా నివారణ చర్యల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఉత్తమ్‌ గవర్నర్‌కు తెలిపారు.

కరోనా పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కేసీఆర్‌ ఆలోచన పూర్తి అశాస్త్రీయంగా ఉందన్నారు. తెలంగాణ కరోనా ఫ్రీ కావాలని కోరుకుంటున్నామని…. కానీ పరీక్షలు చేయకపోవడం, సంబంధిత మరణాలను దాచి పెట్టడం వల్ల అనుమానాలు కలుగుతున్నాయన్నారు.

చనిపోయిన వారు ఎలా చనిపోయారని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని… అలాంటప్పుడు చనిపోయిన వారి మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించవద్దని ఎందుకు ఆదేశాలు ఇచ్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. నాసిరకమైన బియ్యాన్ని పేదలకు పంచిపెడుతున్నారని… ఆ బియ్యాన్ని కూడా గవర్నర్‌కు చూపించామన్నారు. మార్చి 26న కుటుంబానికి కేజీ కందిపప్పు ఇస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారని… కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటి వరకు కంది పప్పు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాని డిమాండ్ చేశారు.

రైతులను ఆదుకోవడంలో, కరోనా నివారణ చర్యల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని… అందుకు నిరసనగా మంగళవారం ఒకరోజు దీక్ష నిర్వహిస్తానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

First Published:  4 May 2020 4:56 AM GMT
Next Story