Telugu Global
Cinema & Entertainment

నేను ఇంకా చిన్న పిల్లాడ్నే

ఈ మాట అంటోంది సంతూర్ యాడ్ లో చిన్నపిల్ల కాదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన విజయ్ దేవరకొండ. పెళ్లి మాటెత్తగానే ఇతడికి చిన్నపిల్లాడ్ని అనే విషయం గుర్తొస్తుంది కాబోలు. తాజాగా మరోసారి తను చిన్నపిల్లాడ్నంటూ ప్రకటించుకున్నాడు విజయ్ దేవరకొండ. ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ, పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. పెళ్లంటే చాలా పెద్ద బాధ్యతని, దాన్ని మోసేంత మెచ్యూరిటీ తనకు ఇంకా రాలేదని అంటున్నాడు. పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాలంటే […]

నేను ఇంకా చిన్న పిల్లాడ్నే
X

ఈ మాట అంటోంది సంతూర్ యాడ్ లో చిన్నపిల్ల కాదు. సినిమా ఇండస్ట్రీకి చెందిన విజయ్ దేవరకొండ. పెళ్లి మాటెత్తగానే ఇతడికి చిన్నపిల్లాడ్ని అనే విషయం గుర్తొస్తుంది కాబోలు. తాజాగా మరోసారి తను చిన్నపిల్లాడ్నంటూ ప్రకటించుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయ్ దేవరకొండ, పెళ్లిపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు. పెళ్లంటే చాలా పెద్ద బాధ్యతని, దాన్ని మోసేంత మెచ్యూరిటీ తనకు ఇంకా రాలేదని అంటున్నాడు.

పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాలంటే మానసికంగా చాలా పరిణతి చెందాలని అన్నాడు. ప్రస్తుతానికైతే తను ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, పెళ్లయితే భార్యతో అన్నీ పంచుకోవాల్సి వస్తుందని, ఆ రిలేషన్ షిప్ ను గౌరవించాలని అంటున్నాడు.

ఇన్ని విషయాలు చెప్పిన విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు చేసుకుంటావనే ప్రశ్నకు మాత్రం సూటిగా జవాబు చెప్పలేదు. ప్రస్తుతం ఈ హీరో, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు. అనన్య పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.

First Published:  3 May 2020 1:21 AM GMT
Next Story