Telugu Global
Cinema & Entertainment

ఐటెంసాంగ్ కోసం బాలీవుడ్ భామ

ఈమధ్యే బన్నీని మెచ్చుకుంది దిశా పటానీ. ఆయన డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇలా చెప్పిందో లేదో ఆమెకి అలా బన్నీ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. అవును.. పుష్ప సినిమాలో ఓ ఐటెంసాంగ్ కోసం దిశాపటానీని సంప్రదించారు. బన్నీతో కలిసి స్టెప్పులేసే ఛాన్స్ అందించారు. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. నిజమయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. సుకుమార్ ప్రతి సినిమాలో ఐటెంసాంగ్ ఉంటుంది. అయితే ఆ ఐటెంసాంగ్ లో హీరోయిన్లను పెట్టే […]

ఐటెంసాంగ్ కోసం బాలీవుడ్ భామ
X

ఈమధ్యే బన్నీని మెచ్చుకుంది దిశా పటానీ. ఆయన డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఇలా చెప్పిందో లేదో ఆమెకి అలా బన్నీ నుంచి ఓ ఆఫర్ వచ్చింది. అవును.. పుష్ప సినిమాలో ఓ ఐటెంసాంగ్ కోసం దిశాపటానీని సంప్రదించారు. బన్నీతో కలిసి స్టెప్పులేసే ఛాన్స్ అందించారు. ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే. నిజమయ్యే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.

సుకుమార్ ప్రతి సినిమాలో ఐటెంసాంగ్ ఉంటుంది. అయితే ఆ ఐటెంసాంగ్ లో హీరోయిన్లను పెట్టే సంప్రదాయాన్ని మాత్రం రంగస్థలం నుంచే కొనసాగిస్తున్నాడు ఈ దర్శకుడు. రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్ లో పూజాహెగ్డే మెరిసింది. ఇప్పుడు పుష్పలో కూడా ఐటెంసాంగ్ కోసం హీరోయిన్ ను తీసుకోవాలని అనుకుంటున్నారు.

ఈసారి ఏకంగా బాలీవుడ్ హీరోయిన్ నే రంగంలోకి దించాలని అనుకుంటున్నారు. అదే టైమ్ లో దిశాపటానీ, బన్నీని మెచ్చుకోవడం.. పుష్ప యూనిట్ ఆమెను సంప్రదించడం బ్యాక్ టు బ్యాక్ జరిగాయని చెబుతున్నారు.

అన్నట్టు దిశా పటానీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తెలుగు సినిమాతోనే. వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమాతో ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు పుష్పతో టాలీవుడ్ లో రీఎంట్రీకి రెడీ అవుతోందన్నమాట.

First Published:  2 May 2020 9:00 PM GMT
Next Story