Telugu Global
Cinema & Entertainment

మళ్లీ వాయిదాపడిన నిఖిల్ పెళ్లి

లెక్కప్రకారం ఏప్రిల్ 16న నిఖిల్ పెళ్లి జరగాలి. కానీ లాక్ డౌన్ వల్ల తన పెళ్లిని మే 14కు వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు లాక్ డౌన్ ను మరోసారి పొడిగించడంతో మే 14న కూడా నిఖిల్ పెళ్లి జరగడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ వెల్లడించాడు. మే 14న కూడా తను పెళ్లి చేసుకోవడం లేదని మీడియాకు స్పష్టంచేశాడు నిఖిల్. ఈసారి పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మాత్రమే తన పెళ్లి తేదీని ప్రకటిస్తానంటున్నాడు. […]

మళ్లీ వాయిదాపడిన నిఖిల్ పెళ్లి
X

లెక్కప్రకారం ఏప్రిల్ 16న నిఖిల్ పెళ్లి జరగాలి. కానీ లాక్ డౌన్ వల్ల తన పెళ్లిని మే 14కు వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు లాక్ డౌన్ ను మరోసారి పొడిగించడంతో మే 14న కూడా నిఖిల్ పెళ్లి జరగడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా నిఖిల్ వెల్లడించాడు.

మే 14న కూడా తను పెళ్లి చేసుకోవడం లేదని మీడియాకు స్పష్టంచేశాడు నిఖిల్. ఈసారి పూర్తిగా లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత మాత్రమే తన పెళ్లి తేదీని ప్రకటిస్తానంటున్నాడు. వరుసగా రెండోసారి పెళ్లి వాయిదాపడడం చాలా చిరాగ్గా ఉందన్న నిఖిల్, బయట ఎంతోమంది ఎదుర్కొంటున్న సమస్యలతో పోల్చి చూస్తే తన సమస్య చాలా చిన్నదంటున్నాడు.

అర్జున్ సురవరం రిలీజైన వెంటనే తన లవ్ మేటర్ ను బయటపెట్టాడు నిఖిల్. పల్లవి అనే డాక్టర్ ను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానని ఆమెనే పెళ్లి చేసుకుంటానని ప్రకటించాడు. చెప్పిన కొన్ని రోజులకే నిఖిల్-పల్లవి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అదే ఊపులో పెళ్లి కూడా అయిపోతుందనుకునే టైమ్ కు కరోనా వల్ల ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతోంది.

First Published:  3 May 2020 4:00 AM GMT
Next Story