Telugu Global
National

మద్యం నియంత్రణ దిశగా ఏపీ కీలక నిర్ణయం

కరోనా కారణంగా మందుబాబులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు మాత్రం మెల్లగా మందు లేకపోయినా బతకొచ్చు అన్న భావనకు వస్తున్నారు. తాగుడు మానేయడం సాధ్యమేనన్న అభిప్రాయానికి వస్తున్నారు. తాజాగా మద్యం షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో మందుబాబులు మందు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం నియంత్రణ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మద్యం వాడకాన్ని తగ్గించడం కోసం ధరలు 25 శాతం పెంచింది. ఈ […]

మద్యం నియంత్రణ దిశగా ఏపీ కీలక నిర్ణయం
X

కరోనా కారణంగా మందుబాబులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొందరు మాత్రం మెల్లగా మందు లేకపోయినా బతకొచ్చు అన్న భావనకు వస్తున్నారు. తాగుడు మానేయడం సాధ్యమేనన్న అభిప్రాయానికి వస్తున్నారు. తాజాగా మద్యం షాపులు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో మందుబాబులు మందు కోసం ఎదురుచూస్తున్నారు.

ఇంతలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం నియంత్రణ దిశగా మరో అడుగు ముందుకు వేసింది. మద్యం వాడకాన్ని తగ్గించడం కోసం ధరలు 25 శాతం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన ధరలతోనే మద్యం అమ్మకాలు సాగించాలని ఆదేశించింది.

మద్యం ధరలను పెంచడమే కాకుండా రానున్న కొద్ది రోజుల్లో మద్యం షాపుల సంఖ్యను మరింత తగ్గించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి జగన్‌ చెప్పినట్టుగానే ఆదాయం కోసం చూసుకోకుండా మద్యం నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా ఉంది.

కరోనా వల్ల బంద్ అయిన మద్యం షాపులు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కోవిడ్‌ కంటైన్‌మెంట్‌ ఏరియాలు లేని గ్రీన్, ఆరెంజ్‌ జోన్లతోపాటు రెడ్‌ జోన్లలోనూ మద్యం విక్రయాలు జరుపుకోవచ్చని కేంద్రం తెలిపింది. మద్యం షాపుల వద్ద భౌతిక దూరం మాత్రం తప్పనిసరి చేయనున్నారు. అయిదుగురికి మించి మద్యం దుకాణం వద్ద ఉండడానికి వీల్లేదు.

అయితే మార్కెట్‌ ఏరియాల్లో ఉన్న మద్యం దుకాణాలు, రెడ్‌ జోన్లలోని మాల్స్‌లో ఉన్న మద్యం దుకాణాలకు ఈ వెసులుబాటు వర్తించదు.

First Published:  3 May 2020 8:40 AM GMT
Next Story