Telugu Global
NEWS

లక్ష బెడ్లు సిద్దం చేయండి

 రాష్ట్రానికి వచ్చే అందరికీ పరీక్షలు అనుమానం ఉంటే క్వారంటైన్‌కే గ్రామ సచివాలయం పరిధిలోనే క్వారంటైన్లు సీఎం జగన్ కరోనాపై పోరాటంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు రాష్ట్రాలలో చిక్కుకపోయిన ఆంధ్రులను తిరిగి ఏపీకి తీసుకొని రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతీ గ్రామ సచివాలయం ఒక […]

లక్ష బెడ్లు సిద్దం చేయండి
X
  • రాష్ట్రానికి వచ్చే అందరికీ పరీక్షలు
  • అనుమానం ఉంటే క్వారంటైన్‌కే
  • గ్రామ సచివాలయం పరిధిలోనే క్వారంటైన్లు
  • సీఎం జగన్

కరోనాపై పోరాటంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇవాళ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పలు రాష్ట్రాలలో చిక్కుకపోయిన ఆంధ్రులను తిరిగి ఏపీకి తీసుకొని రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ప్రతీ గ్రామ సచివాలయం ఒక యూనిట్‌గా పరిగణించి దాని పరిధిలోనే క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతీ క్వారంటైన్ సెంటర్‌లో 10 నుంచి 15 బెడ్లు సిద్దంగా ఉంచాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బెడ్లను సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్‌లో ఉండే వారికి భోజన సదుపాయాలు కల్పించాలని చెప్పారు.

దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా ప్రజలు ఏపీకి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 500 ఆర్టీసీ బస్సులను నిత్యావసర సరుకుల రవాణాకు అనుకూలంగా మార్చాలని.. ఔషధాల పంపిణీకి మొబైల్ యూనిట్లను అందుబాటులో ఉంచాలని చెప్పారు.

రాష్ట్రానికి తిరిగి వచ్చే అందరికీ తప్పకుండా పరీక్షలు నిర్వహించాలని.. అనుమానం ఉంటే క్వారంటైన్‌కు తరలించాల్సిందేనని జగన్ చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి సిఫార్సులు నడవవని.. కరోనాను తరిమికొట్టడానికి చిత్తశుద్దితో వ్యవహరించాల్సిన సమయం వచ్చిందన్నారు.

కాగా, అంతకు ముందు జగన్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఏపీలో చిక్కుకొని పోయిన 20 వేల మంది ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటున్నట్లు జగన్ చెప్పారు. రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న 1900 మంది ఒడిషా వాసులు స్వరాష్ట్రానికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని.. వారికి అవసరమైన ఏర్పాట్లు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.

ఒడిషా వలస కార్మికులు, కూలీలను ఆదుకున్నందుకు సీఎం నవీన్ పట్నాయక్ ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారి తరలింపునకు అవసరమైన రవాణా ఏర్పాట్లు చేస్తున్నందుకు ప్రశంసించారు. ఈ క్లిష్ట సమయంలో సమర్థవంతంగా పని చేస్తున్నందుకు వైఎస్ జగన్‌ను ఒడిషా సీఎం పట్నాయక్ కొనియాడారు.

మరోవైపు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ధర్మేంద్ర ప్రధాన్ కూడా సీఎం జగన్‌ను పొగిడారు. విపత్తు సమయంలో ఒడిషా కూలీలను బాగా చూసుకుంటున్నారని ప్రశంసించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర అధికారులు హాజరయ్యారు.

First Published:  2 May 2020 7:05 AM GMT
Next Story