Telugu Global
Cinema & Entertainment

హిట్ కాంబో మళ్లీ రిపీట్?

విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ.. హిట్ కాంబినేషన్ అనే పదం వీళ్లకు చాలా చిన్నది. అంతకుమించిన పెద్ద కాంబినేషన్ వీళ్లది. ఇంకా చెప్పాలంటే ఇద్దరూ కలిసి టాలీవుడ్ గతినే మార్చేశారు. అప్పుడెప్పుడో శివ వస్తే, ఆ తర్వాత వీళ్లు చేసిన అర్జున్ రెడ్డి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ జోడీ మరోసారి కలవబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం ఈ దర్శకుడు […]

హిట్ కాంబో మళ్లీ రిపీట్?
X

విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగ.. హిట్ కాంబినేషన్ అనే పదం వీళ్లకు చాలా చిన్నది. అంతకుమించిన పెద్ద కాంబినేషన్ వీళ్లది. ఇంకా చెప్పాలంటే ఇద్దరూ కలిసి టాలీవుడ్ గతినే మార్చేశారు. అప్పుడెప్పుడో శివ వస్తే, ఆ తర్వాత వీళ్లు చేసిన అర్జున్ రెడ్డి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడీ జోడీ మరోసారి కలవబోతోంది.

అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే విజయ్ దేవరకొండతో మరో సినిమా చేయబోతున్నాడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం ఈ దర్శకుడు మహేష్ బాబుతో కథా చర్చలు షురూ చేశాడు. మహేష్ తో సినిమా వర్కవుట్ అయినా, అవ్వకున్నా విజయ్ దేవరకొండతో సినిమా చేయాలనేది సందీప్ రెడ్డి ప్లాన్.

ఎందుకంటే.. మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఇప్పటికిప్పుడు సందీప్ తో సినిమా చేయలేడు. కాబట్టి ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండతో సందీప్ ఓ సినిమా పూర్తిచేయొచ్చు. సందీప్ దగ్గర ఆల్రెడీ స్టోరీలైన్స్ ఉన్నాయి. ఆ విషయాన్ని గతంలోనే వెల్లడించాడు ఈ దర్శకుడు. కాకపోతే తనవన్నీ ప్రయోగాత్మక కథలని, వాటికి స్టార్ హీరోలు సరిపోరని అన్నాడు.

ఇలాంటి ప్రయోగాలు చేయడానికి విజయ్ దేవరకొండ ఎప్పుడూ రెడీ కాబట్టి.. వీళ్లిద్దరి కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ ఉందంటూ ఫిలింనగర్ లో రూమర్లు నడుస్తున్నాయి.

First Published:  1 May 2020 8:30 PM GMT
Next Story