Telugu Global
Cinema & Entertainment

కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ

హీరో కార్తికేయ మరో ప్రయోగానికి సిద్ధమౌతున్నాడు. టాలీవుడ్ లో ఇంకా కుదురుకోని ఈ హీరో ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేశాడు. అవును.. త్వరలోనే స్ట్రయిట్ తమిళ సినిమా చేయబోతున్నాడు ఈ ఆర్ఎక్స్100 హీరో. అజిత్ హీరోగా వాళమై అనే సినిమా రాబోతోంది. వినోత్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో ఓ యంగ్ విలన్ పాత్ర కోసం కార్తికేయను సంప్రదించింది యూనిట్. అజిత్ సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పాడు కార్తికేయ. కార్తికేయకు విలన్ రోల్స్ కొత్తకాదు. నాని […]

కార్తికేయ కోలీవుడ్ ఎంట్రీ
X

హీరో కార్తికేయ మరో ప్రయోగానికి సిద్ధమౌతున్నాడు. టాలీవుడ్ లో ఇంకా కుదురుకోని ఈ హీరో ఇప్పుడు కోలీవుడ్ పై కన్నేశాడు. అవును.. త్వరలోనే స్ట్రయిట్ తమిళ సినిమా చేయబోతున్నాడు ఈ ఆర్ఎక్స్100 హీరో.

అజిత్ హీరోగా వాళమై అనే సినిమా రాబోతోంది. వినోత్ ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో ఓ యంగ్ విలన్ పాత్ర కోసం కార్తికేయను సంప్రదించింది యూనిట్. అజిత్ సినిమా కావడంతో వెంటనే ఓకే చెప్పాడు కార్తికేయ.

కార్తికేయకు విలన్ రోల్స్ కొత్తకాదు. నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా నటించాడు ఈ హీరో. భవిష్యత్తులో కూడా మంచి క్యారెక్టర్స్ దొరికితే విలన్ గా నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అప్పట్లోనే ప్రకటించాడు. చెప్పినట్టుగానే కోలీవుడ్ కు కూడా విలన్ గా పరిచయమౌతున్నాడు కార్తికేయ.

అసలే కోలీవుడ్ కు విలన్ల కొరత ఎక్కువగా ఉంది. ఇలాంటి టైమ్ లో కార్తికేయ అక్కడ క్లిక్ అయ్యాడంటే, ఇతడ్ని తీసుకెళ్లి ఎక్కడో కూర్చోబెడతారు తమిళ మేకర్స్. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు.

First Published:  2 May 2020 5:09 AM GMT
Next Story