Telugu Global
Cinema & Entertainment

పుకార్లు ఖండించిన కాజల్

మరోసారి మెగాభిమానులంతా షాక్ అయ్యారు. అసలు ఆచార్య సినిమాకు సంబంధించి ఏం జరుగుతోందంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. దీనికి కారణం కాజల్. అవును.. ఆచార్య సినిమా నుంచి కాజల్ తప్పుకుందంటూ నిన్నటినుంచి ప్రచారం ఊపందుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ అవాక్కయ్యారు. ఆచార్య సినిమాలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ఆఖరి నిమిషంలో తప్పుకుంది. ఆ వెంటనే కొన్ని రోజులకే కాజల్ ను కన్ ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా ఆచార్య […]

పుకార్లు ఖండించిన కాజల్
X

మరోసారి మెగాభిమానులంతా షాక్ అయ్యారు. అసలు ఆచార్య సినిమాకు సంబంధించి ఏం జరుగుతోందంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు. దీనికి కారణం కాజల్. అవును.. ఆచార్య సినిమా నుంచి కాజల్ తప్పుకుందంటూ నిన్నటినుంచి ప్రచారం ఊపందుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ అవాక్కయ్యారు.

ఆచార్య సినిమాలో ముందుగా త్రిషను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె ఆఖరి నిమిషంలో తప్పుకుంది. ఆ వెంటనే కొన్ని రోజులకే కాజల్ ను కన్ ఫర్మ్ చేసుకున్నారు. ఇప్పుడు ఆమె కూడా ఆచార్య నుంచి తప్పుకుందంటూ రూమర్లు రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే దీనిపై కాజల్ తరఫు నుంచి క్లారిటీ ఇచ్చింది.

ఆచార్య సినిమా నుంచి కాజల్ తప్పుకోలేదని అంటున్నారు ఆమె యూనిట్ సభ్యులు. నిజానికి ఆచార్య నిర్మాతల నుంచి కాజల్ కు అడ్వాన్స్ కూడా అందిందని, కాల్షీట్ల కేటాయింపు కూడా జరిగిపోయిందని చెప్పుకొచ్చారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయితే అప్పుడు కాజల్ సెట్స్ పైకి వెళ్లబోతోంది.

First Published:  2 May 2020 6:30 AM GMT
Next Story