Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్-నాగచైతన్య సినిమా

కొన్ని గాసిప్స్ ఎందుకు పుడతాయో అర్థం కాదు. ఒక్కసారిగా అవి తెరపైకొచ్చినప్పుడు ఇదంతా ఉత్తిదే అనిపిస్తుంది. కానీ రోజులు గడిచేకొద్దీ ఆ గాసిప్ క్రమక్రమంగా వాస్తవ రూపంలోకి వస్తుంటే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటిదే ఓ రూమర్, కార్యరూపం దాల్చేందుకు సిద్ధమౌతోంది. అదే త్రివిక్రమ్-నాగచైతన్య సినిమా. ఇంతకీ ఈ సినిమా మేటర్ ఏంటంటే.. ఎప్పుడో చాలా రోజుల కిందట దశరథ్ ఓ కథ సిద్ధం చేసుకున్నాడు. అతడికిప్పుడు అవకాశాలిచ్చేవాళ్లు లేరు కదా. అందుకే […]

త్రివిక్రమ్-నాగచైతన్య సినిమా
X

కొన్ని గాసిప్స్ ఎందుకు పుడతాయో అర్థం కాదు. ఒక్కసారిగా అవి తెరపైకొచ్చినప్పుడు ఇదంతా ఉత్తిదే అనిపిస్తుంది. కానీ రోజులు గడిచేకొద్దీ ఆ గాసిప్ క్రమక్రమంగా వాస్తవ రూపంలోకి వస్తుంటే ఆశ్చర్యపోవడం మన వంతవుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో అలాంటిదే ఓ రూమర్, కార్యరూపం దాల్చేందుకు సిద్ధమౌతోంది. అదే త్రివిక్రమ్-నాగచైతన్య సినిమా. ఇంతకీ ఈ సినిమా మేటర్ ఏంటంటే..

ఎప్పుడో చాలా రోజుల కిందట దశరథ్ ఓ కథ సిద్ధం చేసుకున్నాడు. అతడికిప్పుడు అవకాశాలిచ్చేవాళ్లు లేరు కదా. అందుకే ఆ కథ తీసుకెళ్లి త్రివిక్రమ్ కు చెప్పాడు. త్రివిక్రమ్ కు అది బాగా నచ్చేసింది. అయితే దాన్ని అతడు డైరక్ట్ చేయాలని అనుకోలేదు. నిర్మించాలని భావించాడు. గతంలో పవన్ తో కలిసి ఛల్ మోహన్ రంగ అనే సినిమాను నిర్మించాడు త్రివిక్రమ్. ఆ అనుభవంతో ఈ ప్రాజెక్టులోకి పవన్ ను కూడా లాగాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని హారిక-హాసిని బ్యానర్ చూసుకుంటుంది.

ఇప్పుడు నాగచైతన్య విషయానికొద్దాం. ముగ్గురు అన్నదమ్ముల మధ్య కథ ఇది. ఇద్దరు అన్నదమ్ముల పాత్రలకు హీరోలు కావాలి. అందులో ఓ పాత్ర నాగచైతన్య చేస్తే బాగుంటుందనేది త్రివిక్రమ్ ఉద్దేశం. ఇదే విషయంపై ఇద్దరూ ఫోన్ లో కూడా మాట్లాడుకున్నారట. చైతూ కూడా ఓకే చెప్పినట్టు టాక్.

ప్రస్తుతానికి ఈ రూమర్ ఇలా ఓ షేప్ తీసుకుంటోంది. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు ను ప్రకటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే నాగచైతన్యతో పాటు నటించబోయే ఆ రెండో హీరో ఎవరనేది సస్పెన్స్.

First Published:  1 May 2020 9:00 AM GMT
Next Story