Telugu Global
Cinema & Entertainment

ఆచార్య ఈ ఏడాదే వస్తుంది

భారీ సినిమాలన్నీ వాయిదాపడుతున్న కాలమిది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేట్ అవుతుండడంతో.. సినిమాలన్నీ నిరవథికంగా వాయిదాపడుతున్నాయి. కొన్ని సినిమాలు ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యాయి కూడా. ఈ క్రమంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా కూడా ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం ఊపందుకుంది. వెంటనే యూనిట్ ఆ ప్రచారాన్ని ఖండించింది. చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తుందని స్పష్టంచేసింది […]

ఆచార్య ఈ ఏడాదే వస్తుంది
X

భారీ సినిమాలన్నీ వాయిదాపడుతున్న కాలమిది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ లేట్ అవుతుండడంతో.. సినిమాలన్నీ నిరవథికంగా వాయిదాపడుతున్నాయి. కొన్ని సినిమాలు ఏకంగా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయ్యాయి కూడా. ఈ క్రమంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా కూడా ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ లేదంటూ ప్రచారం ఊపందుకుంది. వెంటనే యూనిట్ ఆ ప్రచారాన్ని ఖండించింది.

చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి వస్తుందని స్పష్టంచేసింది యూనిట్. సినిమాకు సంబంధించి మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని.. కేవలం 30శాతం షూటింగ్ మాత్రమే పెండింగ్ ఉందని తెలిపింది. అయితే ఆ 30శాతం షూటింగ్ రామ్ చరణ్, కాజల్ తో ముడిపడి ఉంది. వీళ్ల డేట్స్ బట్టి వీలైనంత త్వరగా బ్యాలెన్స్ వర్క్ పూర్తిచేసి ఈ ఏడాదిలోనే ఆచార్యను థియేటర్లలోకి తీసుకొస్తామని చెబుతోంది యూనిట్.

గతంలో ఆచార్య విడుదలపై దర్శకుడు కొరటాల శివ కూడా క్లారిటీ ఇచ్చాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాదిలోనే సినిమా థియేటర్లలోకి వస్తుందన్నాడు. అయినప్పటికీ పుకార్లు ఆగకపోవడంతో, స్వయంగా యూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది. కొత్త షెడ్యూల్ ప్రారంభమైన వెంటనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది యూనిట్.

First Published:  30 April 2020 8:01 PM GMT
Next Story