Telugu Global
National

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మృతి

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ (67) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత వైరల్ ఫివర్, ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో పలుమార్లు అడ్మిట్ అయ్యారు. బుధవారం రాత్రి శ్వాసకోస సంబంధిత సమస్యలు రావడంతో ఆయనను హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో […]

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మృతి
X

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ (67) గురువారం కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో అమెరికాలో ఆయన క్యాన్సర్ చికిత్స తీసుకున్నారు. ఇండియాకు వచ్చిన తర్వాత వైరల్ ఫివర్, ఇన్ఫెక్షన్ కారణంగా ముంబైలోని ఆసుపత్రిలో పలుమార్లు అడ్మిట్ అయ్యారు. బుధవారం రాత్రి శ్వాసకోస సంబంధిత సమస్యలు రావడంతో ఆయనను హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిలో చేర్చారు. కాగా, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో చికిత్స పొందుతూ మరణించారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు రాజ్ కపూర్ రెండో కుమారుడు రిషి కపూర్. ఆయన ముంబైలోని చెంబూరులో 1952 సెప్టెంబర్ 4న జన్మించారు. తన తండ్రి పేరుమీద ఆర్కే ఫిలిమ్స్ బ్యానర్‌పై పలు చిత్రాలు నిర్మించారు. కాగా, బాలనటుడిగా ప్రస్థానం ప్రారంభించి తర్వాత హీరోగా అనేక చిత్రాల్లో నటించారు. బాబీ సినిమాతో గుర్తింపుపొందిన రిషి కపూర్ తర్వాత లైలా మజ్ను, సర్గమ్, నగీనా, చాందిని, హనీమూన్, దీవానా, గురుదేవ్ తదితర హిట్ చిత్రాలు మంచి పేరు తీసుకొని వచ్చాయి.

నటి నీతూ సింగ్‌ను పెళ్లాడిన రిషి కపూర్‌కు కొడుకు రణబీర్ కపూర్, కూతురు రిధిమా కపూర్ ఉన్నారు. రణ్‌బీర్ కపూర్ బాలీవుడ్‌లో ప్రస్తుతం స్టార్ హీరో. ఇక రిషి కపూర్ తాతయ్య పృథ్విరాజ్ కపూర్ బాలీవుడ్ తొలి తరం స్టార్ హీరో. తండ్రి రాజ్ కపూర్ ఎవర్ గ్రీన్ నటుడు. రిషి కపూర్ ఫ్యామిలీలో దాదాపు అందరూ బాలీవుడ్ పరిశ్రమకు చెందినవాళ్లే.

సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే రిషి కపూర్.. ఈ ఏడాది ఏప్రిల్ 2న తన చివరి ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు.

First Published:  30 April 2020 12:40 AM GMT
Next Story