Telugu Global
National

ఇంటిలోనే కరోనాకు చికిత్స... కేంద్రం మార్గదర్శకాలు

దేశంలో కరోనా వ్యాప్తి మెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల సంఖ్య భారీగా పెరిగితే ఆస్పత్రులపై ఒత్తిడి పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారు వారి ఇంట్లోనే వైద్యం అందుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండేందుకు సదుపాయం ఉన్న వారు అక్కడే ఉంటూ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స తీసుకునేందుకు కేంద్రం […]

ఇంటిలోనే కరోనాకు చికిత్స... కేంద్రం మార్గదర్శకాలు
X

దేశంలో కరోనా వ్యాప్తి మెల్లగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగుల సంఖ్య భారీగా పెరిగితే ఆస్పత్రులపై ఒత్తిడి పడకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించి కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయి, వ్యాధి తీవ్రత తక్కువగా ఉన్న వారు వారి ఇంట్లోనే వైద్యం అందుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇంట్లో ప్రత్యేక గదిలో ఉండేందుకు సదుపాయం ఉన్న వారు అక్కడే ఉంటూ వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స తీసుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. డాక్టర్లు ఎప్పటికప్పుడు ఎలాంటి మందులు వాడాలి అన్నది రోగికి వివరిస్తుంటారు. అయితే ఇలా ఇంట్లోనే ఉండి వైద్యం తీసుకోవాలనుకునే వారు తప్పనిసరిగా స్వీయ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ నుంచి మార్గదర్శకాలు విడుదలయ్యాయి.

ఈ వెసులుబాటు ఇంట్లో ప్రత్యేక గది ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది. ఇరుకైన ఇంటిలో నివాసం ఉండే వారికి వర్తించదు. ప్రత్యేక గది సదుపాయం లేని వారు ఆస్పత్రిలో వైద్యం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రత్యేక గది ఉన్నా ఆస్పత్రిలోనే వైద్యం తీసుకోవాలని బాధితుడు భావిస్తే అందుకు ప్రభుత్వం అంగీకరిస్తుంది. ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు పలు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే ఇంటి వద్ద ప్రత్యేక సదుపాయాలు ఉన్న వారు ఇంటి వద్దే వైద్యం తీసుకుంటే ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తున్నారు.

కరోనా తీవ్రస్థాయిలో ఉన్న వారు, ఇతర ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వారు మాత్రం ఆస్పత్రిలోనే కరోనాకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటిలోనే ఐసోలేషన్ గదిలో ఉంటూ వైద్యం తీసుకోవాలంటే వైరస్‌ సోకిన వ్యక్తి స్వీయ ధృవీకరణ పత్రం ఇవ్వడంతో పాటు… అలా ఉండేందుకు వైద్యుడు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. ఆస్పత్రిలోనే వైద్యం తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్ అభిప్రాయపడితే అందుకు వైరస్ సోకిన వ్యక్తి ఒప్పుకుని తీరాలి.

ఇంటిలోనే వైద్యం తీసుకునే వ్యక్తి మొబైల్‌లో తప్పనిసరిగా ఆరోగ్యసేతు యాప్‌ ఉండాలి. బ్లూటూత్ ద్వారా లేదా వైఫై ద్వారా నిరంతరం అందుబాటులో ఉండాలి. దీని వల్ల వైరస్ సోకిన వ్యక్తి గదిలోనే ఉంటున్నాడా లేదా అన్నది పర్యవేక్షించడానికి వీలవుతుంది. ఒకవేళ బాధితుడిలో కరోనా తీవ్రత పెరుగుతున్నట్టు గుర్తిస్తే ఆస్పత్రికి తరలిస్తారు.

First Published:  28 April 2020 11:15 PM GMT
Next Story