Telugu Global
Cinema & Entertainment

ఓటీటీపై వంశీ పైడిపల్లి అభిప్రాయం ఇది

ఓటీటీపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్న కాలమిది. నిర్మాతల్లో ఎక్కువమంది ఓటీటీకి మద్దతిస్తున్నారు. థియేటర్ కంటే ముందే ఓటీటీలో సినిమా వేస్తే నిర్మాతకు కాస్త ఆర్థిక వెసులుబాటు దొరుకుతుందని చెబుతున్నారు. సగం మందికి పైగా హీరోలు కూడా ఈ విషయంలో నిర్మాతలకు మద్దతు ఇస్తున్నారు. దర్శకులు మాత్రం ఓటీటీకి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి వంశీ పైడిపల్లి కూడా చేరిపోయాడు. “ప్రేక్షకులకు ఏదో ఒక కొత్తదనం కావాలి. సినిమాలో షడ్రుచులు ఉండాలి. పైగా అదంతా […]

ఓటీటీపై వంశీ పైడిపల్లి అభిప్రాయం ఇది
X

ఓటీటీపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్న కాలమిది. నిర్మాతల్లో ఎక్కువమంది ఓటీటీకి మద్దతిస్తున్నారు. థియేటర్ కంటే ముందే ఓటీటీలో సినిమా వేస్తే నిర్మాతకు కాస్త ఆర్థిక వెసులుబాటు దొరుకుతుందని చెబుతున్నారు. సగం మందికి పైగా హీరోలు కూడా ఈ విషయంలో నిర్మాతలకు మద్దతు ఇస్తున్నారు. దర్శకులు మాత్రం ఓటీటీకి పూర్తి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి వంశీ పైడిపల్లి కూడా చేరిపోయాడు.

“ప్రేక్షకులకు ఏదో ఒక కొత్తదనం కావాలి. సినిమాలో షడ్రుచులు ఉండాలి. పైగా అదంతా 70ఎంఎం బిగ్ స్క్రీన్ పై చూడాలని కోరుకుంటారు. మన సినిమాల బడ్జెట్ వేరు, అది రాబట్టాలంటే థియేటర్ లో సినిమా పడాల్సిందే. అయినా మన కల్చర్ లోనే సినిమా ఉంది. జనాలు థియేటర్ ను వదలరు.”

ఇలా తన అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తంచేశాడు వంశీ పైడిపల్లి. సినిమాకు సంబంధించి ఓటీటీ కంటే థియేటర్ కే తొలి ప్రాధాన్యం ఇవ్వాలంటున్నాడు. అయితే కరోనా వల్ల ఇప్పటికిప్పుడు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కూడా లేదంటున్నాడు పైడిపల్లి. కానీ ఇది తాత్కాలికమని, త్వరలోనే జనాలు థియేటర్లకు వస్తారని నమ్మకంగా చెబుతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ మాత్రమే కాకుండా.. మొత్తం ప్రపంచ సినిమానే ఇబ్బంది పడుతోందని, తేరుకోవడానికి కాస్త టైమ్ పడుతుందని అంటున్నాడు.

First Published:  28 April 2020 6:25 AM GMT
Next Story