Telugu Global
Cinema & Entertainment

పవన్ సినిమాలో తమిళ స్టార్ హీరో !

క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ సినిమాతో పాటు ఈ మూవీ షెడ్యూల్స్ కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. కాకపోతే పవన్ తో పాటు ఫ్యాన్స్ దృష్టి మొత్తం ప్రస్తుతం వకీల్ సాబ్ పై ఉంది. అది రిలీజ్ అయిన వెంటనే క్రిష్ మూవీ పనులు ఊపందుకుంటాయి. ఈ గ్యాప్ లో తన సినిమాలో మరో కీలక పాత్రను ఎంపిక చేశాడు దర్శకుడు క్రిష్. పవన్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీలో ఓ […]

పవన్ సినిమాలో తమిళ స్టార్ హీరో !
X

క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు పవన్ కల్యాణ్. వకీల్ సాబ్ సినిమాతో పాటు ఈ మూవీ షెడ్యూల్స్ కూడా సమాంతరంగా నడుస్తున్నాయి. కాకపోతే పవన్ తో పాటు ఫ్యాన్స్ దృష్టి మొత్తం ప్రస్తుతం వకీల్ సాబ్ పై ఉంది. అది రిలీజ్ అయిన వెంటనే క్రిష్ మూవీ పనులు ఊపందుకుంటాయి. ఈ గ్యాప్ లో తన సినిమాలో మరో కీలక పాత్రను ఎంపిక చేశాడు దర్శకుడు క్రిష్.

పవన్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీలో ఓ కీలక పాత్ర కోసం తమిళ హీరో శివ కార్తికేయన్ ను సంప్రదించాడు క్రిష్. మొఘల్ కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ అనుచరుడి పాత్రను శివకు వివరించాడు. క్యారెక్టర్ అయితే బలమైనదే కానీ శివ కార్తికేయన్ మాత్రం ఇంకా పచ్చజెండా ఊపలేదని తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్న ఈ హీరో, కాల్షీట్లు ఎడ్జెస్ట్ అయితే తప్పకుండా సినిమా చేస్తానని క్రిష్ కు మాటిచ్చాడట.

తెలుగు ప్రేక్షకులకు కూడా శివ కార్తికేయన్ పరిచయమే. ఆమధ్య వచ్చిన కౌశల్య కృష్ణమూర్తి సినిమాలో క్రికెట్ కోచ్ గా కనిపించింది ఇతడే. కీర్తిసురేష్ హీరోయిన్ గా ఇతడు చేసిన రెమో సినిమా ఇప్పటికీ టీవీల్లో పలకరిస్తూనే ఉంటుంది. దీంతో పాటు ఇతడు నటించిన శక్తి అనే సినిమా తెలుగులో రిలీజ్ అవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ప్రత్యక్షమైంది.

First Published:  27 April 2020 8:30 PM GMT
Next Story