Telugu Global
Cinema & Entertainment

వాళ్లిద్దరు మళ్లీ కలిశారు?

తెలుగుతెరపై హిట్ కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఇప్పటి యంగ్ హీరోస్ వరకు అందరూ దీన్ని నమ్ముతారు. మరీ ముఖ్యంగా హిట్ కాంబినేషన్ మరోసారి కలిస్తే సినిమాకు ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుంది. మార్కెట్ పెరుగుతుంది. అందుకే మేకర్స్ కు అలాంటి కాంబినేషన్లు అంటే అంతిష్టం. ఇప్పుడిదే ఫార్ములా ప్రకారం మరోసారి కలుస్తున్నారు రాజ్ తరణ్, అవికాగౌర్. వీళ్లిద్దరికీ హిట్ కాంబినేషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఉయ్యాల జంపాల సినిమాతో పరిచయమైన […]

వాళ్లిద్దరు మళ్లీ కలిశారు?
X

తెలుగుతెరపై హిట్ కాంబినేషన్లకు ఉండే క్రేజే వేరు. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి ఇప్పటి యంగ్ హీరోస్ వరకు అందరూ దీన్ని నమ్ముతారు. మరీ ముఖ్యంగా హిట్ కాంబినేషన్ మరోసారి కలిస్తే సినిమాకు ఆటోమేటిగ్గా క్రేజ్ వస్తుంది. మార్కెట్ పెరుగుతుంది. అందుకే మేకర్స్ కు అలాంటి కాంబినేషన్లు అంటే అంతిష్టం. ఇప్పుడిదే ఫార్ములా ప్రకారం మరోసారి కలుస్తున్నారు రాజ్ తరణ్, అవికాగౌర్.

వీళ్లిద్దరికీ హిట్ కాంబినేషన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఉయ్యాల జంపాల సినిమాతో పరిచయమైన వీళ్లిద్దరూ, ఆ సినిమాతో హిట్ కొట్టారు. ఆ తర్వాత ‘సినిమా చూపిస్త మామ’ సినిమాతో ఇద్దరూ కలిసి మరో హిట్ కొట్టారు. ఇప్పుడు హ్యాట్రిక్ మూవీకి సిద్ధమౌతోంది ఈ జంట.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఓ లవ్ స్టోరీ రాసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్ గవిరెడ్డి. తన సినిమాలో రాజ్ తరుణ్, అవికా గౌర్ ను పెయిర్ గా చూపించాలని ఫిక్స్ అయ్యారు. రాజ్ తరుణ్ దాదాపు 2 నెలల కిందటే ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా అవికా గౌర్ కూడా ఓకే చెప్పింది. అలా ఉయ్యాల జంపాల జోడి మరోసారి కలిసింది. ఈసారి వీళ్లిద్దరి కెమిస్ట్రీ తెరపై ఎలా ఉండబోతోందో చూడాలి.

First Published:  28 April 2020 4:25 AM GMT
Next Story