Telugu Global
Cinema & Entertainment

ఈసారి కీర్తిసురేష్ ఒప్పుకుంటుందా?

మహానటి అనే ఒకేఒక్క సినిమాతో కీర్తిసురేష్ పేరు సౌత్ అంతటా మారుమోగిపోయింది. ఈ సినిమాతో ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. సావిత్రి బయోపిక్ ఆమెకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరో బయోపిక్ ఆఫర్ ఈమెను వరించింది. మరి ఈసారి కీర్తిసురేష్ ఒప్పుకుంటుందా అనేది చూడాలి. కథానాయిక, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల బయోపిక్ ను ఆమె కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవలే కన్నుమూసిన ఆమె చరిత్రను, సాధించిన విజయాలను నేటి […]

ఈసారి కీర్తిసురేష్ ఒప్పుకుంటుందా?
X

మహానటి అనే ఒకేఒక్క సినిమాతో కీర్తిసురేష్ పేరు సౌత్ అంతటా మారుమోగిపోయింది. ఈ సినిమాతో ఆమె ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. సావిత్రి బయోపిక్ ఆమెకు ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరో బయోపిక్ ఆఫర్ ఈమెను వరించింది. మరి ఈసారి కీర్తిసురేష్ ఒప్పుకుంటుందా అనేది చూడాలి.

కథానాయిక, దర్శకురాలు, నిర్మాత విజయనిర్మల బయోపిక్ ను ఆమె కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇటీవలే కన్నుమూసిన ఆమె చరిత్రను, సాధించిన విజయాలను నేటి తరానికి చెప్పాలని భావిస్తున్నాడట ఆమె తనయుడు నరేష్. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ లో పేరు ఎక్కించుకున్న తన తల్లి కథతో సినిమా తీయాలని నరేష్ భావిస్తున్నాడు.

ఈ బయోపిక్ కు సంబంధించి ఇప్పటికే కథ రెడీ చేయించిన నరేష్.. విజయనిర్మల పాత్రలో కీర్తిసురేష్ నటిస్తే బాగుంటుందని భావిస్తున్నాడు. ఈ మేరకు ఆమెను సంప్రదించినట్టు కూడా వార్తలొచ్చాయి. మరి విజయనిర్మల బయోపిక్ లో నటించడానికి కీర్తిసురేష్ ఒప్పుకుంటుందా అనేది వేచిచూడాలి.

First Published:  27 April 2020 10:30 PM GMT
Next Story