Telugu Global
Cinema & Entertainment

పుష్ప మేటర్ బయటపెట్టిన దేవిశ్రీ

లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి పుష్ప సినిమా షెడ్యూల్ శరవేగంగా జరగాల్సిన పరిస్థితి. కానీ ఊహించని విధంగా అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. సినిమా షూటింగ్ నిరవథికంగా వాయిదాపడింది. అయితే షూటింగ్ లేకపోయినా దర్శకుడు సుకుమార్ మాత్రం ఖాళీగా లేడు. దేవిశ్రీప్రసాద్ తో కలిసి ఆన్ లైన్ లో సుకుమార్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడనే విషయాన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని దేవిశ్రీప్రసాద్ కూడా నిర్థారించాడు. పుష్ప సినిమాకు వర్క్ చేసిన విషయాన్ని […]

పుష్ప మేటర్ బయటపెట్టిన దేవిశ్రీ
X

లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి పుష్ప సినిమా షెడ్యూల్ శరవేగంగా జరగాల్సిన పరిస్థితి. కానీ ఊహించని విధంగా అంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. సినిమా షూటింగ్ నిరవథికంగా వాయిదాపడింది. అయితే షూటింగ్ లేకపోయినా దర్శకుడు సుకుమార్ మాత్రం ఖాళీగా లేడు. దేవిశ్రీప్రసాద్ తో కలిసి ఆన్ లైన్ లో సుకుమార్ మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడనే విషయాన్ని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయాన్ని దేవిశ్రీప్రసాద్ కూడా నిర్థారించాడు.

పుష్ప సినిమాకు వర్క్ చేసిన విషయాన్ని అంగీకరించాడు దేవిశ్రీ. ఈ లాక్ డౌన్ టైమ్ లో పుష్ప సినిమాకు 3 ట్యూన్స్ ఇచ్చానని.. అటు బన్నీ, ఇటు సుకుమార్ ఇద్దరికీ ఆ ట్యూన్స్ నచ్చాయని తెలిపాడు. దేవిశ్రీ-సుక్కూ-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో పుష్పపై భారీ అంచనాలున్నాయి. పైగా అల వైకుంఠపురములో సినిమాతో తమన్, బన్నీకి పెద్ద మ్యూజికల్ హిట్ ఇచ్చాడు. సో.. ఇప్పుడు దాన్ని బీట్ చేసే రేంజ్ లో మరో మ్యూజిక్ ఆల్బమ్ ఇవ్వడం దేవిశ్రీకి సవాల్ గా మారింది.

అయితే ఇలాంటివేం పట్టించుకోనంటున్నాడు డీఎస్పీ. కథ ప్రకారం ట్యూన్స్ ఇచ్చుకుంటూ వెళ్లడమే తన పని అంటున్నాడు. పుష్ప సినిమా స్టోరీ అదిరిపోయిందని, సుకుమార్ కెరీర్ బెస్ట్ గా ఇది నిలిచిపోతుందని చెబుతున్న దేవిశ్రీ.. ఆర్య-2, రంగస్థలం సినిమాల టైపులోనే పుష్పలో కూడా ఐటెంసాంగ్ ఉంటుందనే విషయాన్ని నిర్థారించాడు. కాకపోతే ఆ సాంగ్ మ్యూజిక్ సిట్టింగ్స్ ఇంకా ప్రారంభించలేదని తెలిపాడు.

First Published:  28 April 2020 1:00 AM GMT
Next Story