Telugu Global
NEWS

ఏపీ సీఎం వద్దకు చేరిన మీడియా సెగ

ఏపీ ప్రభుత్వ పరిస్థితి విచిత్రంగా తయారైంది. తొలుత టెస్ట్‌ కిట్లు సరైన మోతాదులో లేకపోవడంతో మిగిలిన రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా తక్కువగా పరీక్షలు జరిగేవి. అప్పుడు టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా ఏపీలో పరీక్షలు చేయడం లేదు… కరోనా లెక్కలను దాస్తున్నారంటూ ప్రచారం చేశాయి. ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. భారీగా పరీక్షలు నిర్వహించడం వల్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇది మంచి పరిణామమే. […]

ఏపీ సీఎం వద్దకు చేరిన మీడియా సెగ
X

ఏపీ ప్రభుత్వ పరిస్థితి విచిత్రంగా తయారైంది. తొలుత టెస్ట్‌ కిట్లు సరైన మోతాదులో లేకపోవడంతో మిగిలిన రాష్ట్రాల తరహాలోనే ఏపీలో కూడా తక్కువగా పరీక్షలు జరిగేవి. అప్పుడు టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా ఏపీలో పరీక్షలు చేయడం లేదు… కరోనా లెక్కలను దాస్తున్నారంటూ ప్రచారం చేశాయి.

ఇప్పుడు దేశంలోనే అత్యధికంగా పరీక్షలు నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో ఉంది. భారీగా పరీక్షలు నిర్వహించడం వల్ల కరోనా కేసులు బయటపడుతున్నాయి. ఇది మంచి పరిణామమే. కానీ మీడియా మాత్రం ఏపీ ప్రభుత్వంపై నిత్యం బురద జల్లుతూనే ఉంది.

మీడియా ప్రచారాన్ని తిప్పి కొట్టే విషయంలో ఏపీ ప్రభుత్వానికి గానీ, వైసీపీకి గానీ సరైన సన్నద్దత లేకపోవడంతో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు కూడా ప్రజల్లోకి మరోలా వెళ్తున్నాయి. ముఖ్యమంత్రి ఈ ప్రచారాన్ని పట్టించుకోకపోయినా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది మాత్రం ఒత్తిడికి గురవుతున్నారు. ఈ విషయాన్ని ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో కొందరు అధికారులు నేరుగా ముఖ్యమంత్రి దృష్టికే తీసుకెళ్లారు.

ఏపీలో కరోనా అంశంపై కొన్ని మీడియా సంస్థలు ప్రజలను భయపెట్టేలా వార్తలు రాస్తున్నాయని… దీని వల్ల సామాజికంగా చెడు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సీఎంకు వివరించారు. మీడియా సృష్టిస్తున్న భయం వల్లే… చివరకు కరోనా వల్ల చనిపోయిన వారి అంత్యక్రియలను కూడా ప్రజలు అడ్డుకునే పరిస్థితి వచ్చిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

మానవత్వం మంటగలిసి వివక్ష, విధ్వేషం పెంచేలా మీడియా కథనాలు ఉంటున్నాయని… వాటిని కట్టడి చేయలేకపోతే అధికారుల, సిబ్బంది మనోధైర్యం కూడా దెబ్బతింటుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి వద్ద అధికారులు స్పష్టం చేశారు.

ఇందుకు స్పందించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి… మీడియా వైఖరి బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రజల్లో ధైర్యం నింపాల్సిన మీడియా ఇలా భయాలను సృష్టించడం సరికాదని అభిప్రాయపడ్డారు.

First Published:  27 April 2020 2:17 AM GMT
Next Story