Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాలో మెగాడాటర్

చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది నిహారిక. గిరిజన యువతి పాత్రలో ఆమె కొద్దిసేపు కనిపించింది. ఇదేదో కావాలని ఆమెను ఎంపిక చేసింది కాదు. చిరంజీవి సినిమాలో నటించాలనే కోరికను నిహారిక అలా తీర్చుకుంది. ఇప్పుడు మరోసారి అదే కోరికను తీర్చుకోబోతోంది ఈ మెగా డాటర్. అవును.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలో కూడా నిహారిక ఉంది. ఇందులో కూడా ఆమెది కీలక పాత్ర కాదు. ఫ్లాష్ బ్యాక్ […]

చిరంజీవి సినిమాలో మెగాడాటర్
X

చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించింది నిహారిక. గిరిజన యువతి పాత్రలో ఆమె కొద్దిసేపు కనిపించింది. ఇదేదో కావాలని ఆమెను ఎంపిక చేసింది కాదు. చిరంజీవి సినిమాలో నటించాలనే కోరికను నిహారిక అలా తీర్చుకుంది. ఇప్పుడు మరోసారి అదే కోరికను తీర్చుకోబోతోంది ఈ మెగా డాటర్.

అవును.. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలో కూడా నిహారిక ఉంది. ఇందులో కూడా ఆమెది కీలక పాత్ర కాదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే రామ్ చరణ్ కు సిస్టర్ క్యారెక్టర్ లో నిహారిక కనిపించనుంది. చరణ్-నిహారిక మధ్య 2 సీన్లు ఉంటాయని తెలుస్తోంది.

ప్రస్తుతం నిహారికకు ఆఫర్లు రావడం లేదు. చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో ఆమెతో సినిమా చేసేందుకు ఎవ్వరూ ముందుకురావడం లేదు. పైగా హీరోయిన్ మెటీరియల్ కూడా కాకపోవడంతో అంతా నిహారికను లైట్ తీసుకున్నారు. ప్రస్తుతం తన చేతిలో ఒకే ఒక్క సినిమా (అది కూడా తమిళ్) ఉందనే విషయాన్ని అంగీకరించిన నిహారిక.. చిరంజీవి సినిమాల్లో మాత్రం చిన్నచిన్న పాత్రలు చేస్తానని చెప్పుకొచ్చింది.

First Published:  26 April 2020 10:00 PM GMT
Next Story