Telugu Global
International

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న మహిళ చనిపోలేదు... బతికే ఉందని నిరూపించిన బీబీసీ

నిజం గడప దాటేలోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టొస్తుందని పెద్దలు చెప్పారు. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో నిజం నోట్లోంచి రాకముందే అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కల్లోల్లానికి అట్టుడికిపోతోంది. చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి ప్రపంచదేశాలను గజగజా వణికిస్తోంది. కోవిడ్-19 రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతుండటంతో అన్ని దేశాలు వ్యాక్సిన్ రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సార్-కోవ్-2 కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్దం చేశారు. ఈ […]

కరోనా వ్యాక్సిన్ వేసుకున్న మహిళ చనిపోలేదు... బతికే ఉందని నిరూపించిన  బీబీసీ
X

నిజం గడప దాటేలోపు అబద్దం ప్రపంచాన్ని చుట్టొస్తుందని పెద్దలు చెప్పారు. ప్రస్తుత సోషల్ మీడియా కాలంలో నిజం నోట్లోంచి రాకముందే అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా కల్లోల్లానికి అట్టుడికిపోతోంది. చైనాలో ప్రారంభమైన ఈ మహమ్మారి ప్రపంచదేశాలను గజగజా వణికిస్తోంది. కోవిడ్-19 రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతుండటంతో అన్ని దేశాలు వ్యాక్సిన్ రూపొందించడంలో నిమగ్నమయ్యాయి.

ఈ క్రమంలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సార్-కోవ్-2 కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్దం చేశారు. ఈ వ్యాక్సిన్‌ను మానవులపై ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతులు లభించాయి. దీంతో స్వచ్చందంగా ముందుకు వచ్చిన 800 మందిపై వాక్సిన్ ప్రయోగించారు. యూకేకి చెందిన మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ ఎలీసా గ్రనాటో తొలి వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్‌తో పోరాడే యాంటీ బాడీస్‌ను రూపొందించి మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని పరిశోధకులు అంటున్నారు.

అయితే గత రెండు రోజులుగా ఈ వ్యాక్సిన్ తీసుకున్న తొలి వ్యక్తి డాక్టర్ ఎలీసా గ్రనాటో మరణించిందని.. వ్యాక్సిన్ వికటించడం వల్లే ఆమె మరణించిందని మీడియాలో విస్తృతంగా వార్తలు వచ్చాయి. కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా నిజమేంటో తెలుసుకోకుండా వ్యాక్సిన్ తీసుకున్న రెండో రోజే ఆమె మరణించినట్లు రిపోర్టు చేశాయి. కాగా, ఈ విషయంపై బీబీసీ జర్నలిస్టు ఒకరు ఆరా తీయగా అదంతా ఫేక్ న్యూస్ అని తేలింది.

డాక్టర్ గ్రనాటో పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. అంతే కాకుండా ఆమె తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడటమే కాకుండా బీబీసీకి ఒక వీడియోను స్కైప్ ద్వారా పంపించారు. ‘ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ట్విట్టర్ అకౌంట్ ఉపయోగించడం లేదు. కాని నాతో మాట్లాడారు. తన పై వచ్చిన వార్తలన్నీ ఫేక్ అని ఆమె చెప్పారు’ అని బీబీసీ మెడికల్ జర్నలిస్టు ఫెర్గుస్ వాల్ష్ ఒక ట్వీట్‌లో చెప్పారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. వ్యాక్సిన్ పని తీరును ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారని.. ఆమెతో పాటు మరి కొందరు వాలంటీర్లు కూడా ల్యాబ్ ట్రయల్స్‌లో పాల్గొన్నట్లు తెలిసింది.

First Published:  27 April 2020 2:45 AM GMT
Next Story