Telugu Global
NEWS

కరోనాలో మిరాకిల్‌... బుడ్డోడికి సోకని వైరస్‌ !

కరోనా. ఇదో మహమ్మారి వైరస్‌. ఇప్పుడు కొన్ని కేసులను పరిశీలిస్తే ఇదే అన్పిస్తోంది. శ్రీకాకుళంలో మొన్నటివరకూ ఒక్క కేసు లేదు. ఇప్పుడు పాతపట్నంలో మూడు కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన అతన్ని క్వారంటైన్‌లో ఉంచారు. కానీ అతనికి నెగటివ్‌ వచ్చింది. దాదాపు 20 రోజుల తర్వాత వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చింది. రోగ నిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల కరోనాను అతను తట్టుకున్నాడు. కానీ అతని కుటుంబ సభ్యులకు మాత్రం ఈ వ్యాధి […]

కరోనాలో మిరాకిల్‌... బుడ్డోడికి సోకని వైరస్‌ !
X

కరోనా. ఇదో మహమ్మారి వైరస్‌. ఇప్పుడు కొన్ని కేసులను పరిశీలిస్తే ఇదే అన్పిస్తోంది. శ్రీకాకుళంలో మొన్నటివరకూ ఒక్క కేసు లేదు. ఇప్పుడు పాతపట్నంలో మూడు కేసులు బయటపడ్డాయి. ఢిల్లీ వెళ్లి వచ్చిన అతన్ని క్వారంటైన్‌లో ఉంచారు. కానీ అతనికి నెగటివ్‌ వచ్చింది. దాదాపు 20 రోజుల తర్వాత వారి కుటుంబ సభ్యులకు పాజిటివ్‌ వచ్చింది. రోగ నిరోధక శక్తి బలంగా ఉండడం వల్ల కరోనాను అతను తట్టుకున్నాడు. కానీ అతని కుటుంబ సభ్యులకు మాత్రం ఈ వ్యాధి సోకింది.

అలాగే కరోనా సోకిన వ్యక్తితో ఐదు నిమిషాలు దగ్గరగా ఉంటే చాలు మనకు వ్యాపిస్తుంది. కానీ ఒక బుడతడు పాజిటివ్ ఉన్న వ్యక్తితో 17రోజులు గడిపాడు. ఆడుతూ పాడుతూ…ముద్దాడుతూ ఆస్పత్రిలోనే ఉన్నాడు… కానీ ఆ మహమ్మారి… ఆ చంటోడిని టచ్ చేయలేకపోయింది. ఇది ఎలా సాధ్యమైంది… అని డాక్టర్లే అవాక్కయ్యేలా చేసిన ఈ ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.

చిత్తూరు జిల్లాలో ఓ ముస్లిం యువతికి కరోనా సోకింది. నగరి పట్టణానికి చెందిన బాలుడి పెద్దనాన్న ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి రావడంతో అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిది ఉమ్మడి కుటుంబం కావడంతో బాలుడి తల్లికి కూడా పాజిటివ్ రావడంతో ఈనెల 8న చిత్తూరులోని ఐసొలేషన్‌ కేంద్రానికి తరలించి చికిత్స అందించారు.

అయితే… ఏడాదిన్నర వయసున్న ఆ బాబు బాగోగులు చూసేందుకు బంధువులెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో 17 రోజుల పాటు తల్లి వద్దే బాబు ఉన్నాడు. 7రోజుల తర్వాత తల్లితో పాటు బిడ్డకు పరీక్షలు నిర్వహిస్తే నెగెటివ్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఇదెలా సాధ్యమైందన్నదానిపై వైద్యులు కూడా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తమ సొంత గ్రామానికి వెళ్లారు.

ఎమ్మెల్యే రోజా సైతం తమ నియోజక వర్గానికి చెందిన మహిళ కోలుకుని బయటకు రావడంతో పాటు ఏడాదిన్నర బాబు క్షేమంగా రావడం అద్భుతం అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

First Published:  25 April 2020 10:37 PM GMT
Next Story