Telugu Global
Cinema & Entertainment

విజయ్ దేవరకొండను రష్మిక అందుకే దూరం పెడుతోందా?

ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ప్రముఖ హీరోయిన్ లలో రష్మిక మందన్నా ఒకరు. మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’.. భీష్మా చిత్రాలతో వరుసగా రెండు హిట్స్ కొట్టి కెరీర్ లో దూసుకుపోతోంది. అయితే తెలుగులో అందరికంటే ఎక్కువగా విజయ్ దేవరకొండతో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ తన అభిమాన హీరో ఎవరు అని అడిగితే తమిళ స్టార్ హీరో విజయ్ అని ఠక్కున చెబుతుంది. ఇక మీ అభిమాన సహ నటుడి పేరు చెప్పమంటే ఎవరెవరో పేర్లు చెబుతుంది […]

విజయ్ దేవరకొండను రష్మిక అందుకే దూరం పెడుతోందా?
X

ఇప్పుడు సౌత్ ఇండియాలోనే ప్రముఖ హీరోయిన్ లలో రష్మిక మందన్నా ఒకరు. మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’.. భీష్మా చిత్రాలతో వరుసగా రెండు హిట్స్ కొట్టి కెరీర్ లో దూసుకుపోతోంది.

అయితే తెలుగులో అందరికంటే ఎక్కువగా విజయ్ దేవరకొండతో నటించింది ఈ ముద్దుగుమ్మ. కానీ తన అభిమాన హీరో ఎవరు అని అడిగితే తమిళ స్టార్ హీరో విజయ్ అని ఠక్కున చెబుతుంది. ఇక మీ అభిమాన సహ నటుడి పేరు చెప్పమంటే ఎవరెవరో పేర్లు చెబుతుంది కానీ.. విజయ్ దేవరకొండ పేరు మాత్రం ఆమె చెప్పడం లేదు.

నిజానికి విజయ్ దేవరకొండ సినిమాలతోనే ‘రష్మిక’కు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ వచ్చింది. విజయ్-రష్మిక స్క్రీన్ ప్రజెన్స్, కెమిస్ట్రీ, రోమాన్స్ ఆయా చిత్రాల్లో హైలైట్ గా నిలిచాయి. గీతాగోవిందం, డియర్ క్రామెడ్ లతో వీరి కెమిస్ట్రీ ఫుల్ వర్కవుట్ అయ్యింది. అయితే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని గుసగుసలు వినిపించాయి. కానీ తాము ఫ్రెండ్స్ మాత్రమేనని.. అవన్నీ వట్టి పుకార్లు అని ఇద్దరూ కొట్టిపారేశారు.

చిత్రపరిశ్రమలో విజయ్ బెస్ట్ హీరో అంటే మళ్లీ కొత్త వార్తలు పుట్టుకొస్తాయేమోనని విజయ్ ను అవైడ్ చేస్తున్నట్టు తెలిసింది. ఇలాంటి వార్తలు వస్తే ఆమెకు ఇతర స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రావనే భయం కూడా ఆమెను అలా చెప్పేలా చేస్తోందంటున్నారు.

హీరోయిన్ గా స్టార్ డమ్, నంబర్ 1 స్థానానికి ఎదగడం కోసం రష్మిక ఇలా విజయ్ ను దూరం పెట్టడం ఆమె కెరీర్ కు నిజంగానే హెల్ప్ అవుతుందంటున్నారు. ఆమె ఇండస్ట్రీలో తెలివైన వ్యూహంతోనే వెళుతోందంటున్నారు. అందుకే తాజాగా అల్లు అర్జున్ ‘పుష్పా’ సినిమాలోనూ హీరోయిన్ గా రష్మిక ఎంపికైంది.

First Published:  25 April 2020 12:47 AM GMT
Next Story