Telugu Global
Cinema & Entertainment

రాజమౌళి కోసం వంశీ పైడిపల్లికి హ్యాండిచ్చిన మహేష్ బాబు !

అవసరార్థం సినిమాలు, రాజకీయాల్లో వాడుకోవడాలు ఉంటాయని.. వాటిని దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. కొన్ని కొన్ని సార్లు నిజమవుతుంటాయవీ.. తాజాగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేయడంతో మహేష్ బాబు తన నెక్ట్స్ ప్రాజెక్టులన్నింటిని క్యాన్సిల్ చేస్తున్నట్టు తెలిసింది. నిజానికి మహర్షి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో మరో సినిమాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత అదే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండేది. కానీ వంశీ వినిపించిన […]

రాజమౌళి కోసం వంశీ పైడిపల్లికి హ్యాండిచ్చిన మహేష్ బాబు !
X

అవసరార్థం సినిమాలు, రాజకీయాల్లో వాడుకోవడాలు ఉంటాయని.. వాటిని దగ్గర నుంచి చూసిన వారు చెబుతుంటారు. కొన్ని కొన్ని సార్లు నిజమవుతుంటాయవీ.. తాజాగా రాజమౌళి సినిమా అనౌన్స్ చేయడంతో మహేష్ బాబు తన నెక్ట్స్ ప్రాజెక్టులన్నింటిని క్యాన్సిల్ చేస్తున్నట్టు తెలిసింది.

నిజానికి మహర్షి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో మరో సినిమాకు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు తర్వాత అదే సెట్స్ పైకి వెళ్లాల్సి ఉండేది. కానీ వంశీ వినిపించిన కథ నచ్చకపోవడంతో మహేష్ బాబు పక్కన పెట్టేశాడు. మంచి కథతో రావాలని… చేద్దామని పంపించాడట.

ప్రస్తుతం ‘గీతాగోవిందం ఫేమ్’ పరుశురాంతో మహేష్ బాబు సినిమాకు ఓకే చెప్పాడు. ఆఫ్టర్ కరోనా అదే సెట్స్ పైకి వెళ్ల నుంది. అయితే దీని తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా సందిగ్ధంలో పడింది.

రాజమౌళి ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి ముగుస్తుంది. ఆ తర్వాత మహేష్ బాబుతో సినిమాను జక్కన్న పట్టాలెక్కిస్తాడు. ఈ లోపు మహేష్ బాబు కూడా పరుశురాంతో సినిమా పూర్తి చేస్తాడు. తర్వాత రాజమౌళి కోసం వెయిటింగ్ లోనే ఉంటాడు. దీంతో వంశీ పైడిపల్లికి మహేష్ బాబు హ్యాండిచ్చినట్టే అన్న ప్రచారం టాలీవుడ్ లో సాగుతోంది.

First Published:  25 April 2020 6:48 AM GMT
Next Story