Telugu Global
Cinema & Entertainment

రాజమౌళిలో నాకు నచ్చని అంశం ఇదే

దాదాపు 5 రోజులుగా రాజమౌళి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అతడికి సంబంధించిన ఏదో ఒక అంశం వార్తల్లో నలుగుతూనే ఉంది. కేవలం ఆర్ఆర్ఆర్ అప్ డేట్స్ మాత్రమే కాదు.. రాజమౌళి పర్సనల్ లైఫ్, ఆయన వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించిన విశేషాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా జక్కన్నకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ను బయటపెట్టాడు అతడి బంధువు, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి. ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కీరవాణి.. రాజమౌళిలో తనకు […]

రాజమౌళిలో నాకు నచ్చని అంశం ఇదే
X

దాదాపు 5 రోజులుగా రాజమౌళి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అతడికి సంబంధించిన ఏదో ఒక అంశం వార్తల్లో నలుగుతూనే ఉంది. కేవలం ఆర్ఆర్ఆర్ అప్ డేట్స్ మాత్రమే కాదు.. రాజమౌళి పర్సనల్ లైఫ్, ఆయన వ్యక్తిగత ఇష్టాలకు సంబంధించిన విశేషాలు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా జక్కన్నకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ను బయటపెట్టాడు అతడి బంధువు, మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి.

ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన కీరవాణి.. రాజమౌళిలో తనకు బాగా నచ్చిన అంశం, నచ్చని అంశం గురించి మాట్లాడడు. రాజమౌళిలో కసి కీరవాణికి బాగా నచ్చుతుందట. ఏదైనా పని మొదలుపెడితే, దాన్ని పూర్తిచేసే వరకు వదలడట. ఆయన ఏకాగ్రత ఆ రేంజ్ లో ఉంటుందట. ఇక రాజమౌళిలో నచ్చని అంశాన్ని కూడా బయటపెట్టాడు కీరవాణి.

రాజమౌళి ఇంట్లో కూర్చొని ఎక్కువగా చిన్న పిల్లల సినిమాలు చూస్తుంటాడట. ఆ విషయం తనకు నచ్చదంటాడు కీరవాణి. ఎప్పుడూ చిన్న పిల్లల సినిమాలు చూసేబదులు, కాస్త మంచి సినిమాలు, పెద్ద సినిమాలు చూస్తే మంచిది కదా అంటాడు. ఇలా రాజమౌళి చిలిపి వీక్ నెస్ ను బయటపెట్టాడు కీరవాణి.

First Published:  24 April 2020 1:06 AM GMT
Next Story