Telugu Global
National

ఏపీకి ఐసీఎంఆర్ అనుమతి

కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మిగిలిన రాష్ట్రాల కంటే చాలా ముందుంది. మొన్నటి వరకు తొలి స్థానంలో రాజస్థాన్ ఉండగా ఇప్పుడు రాజస్థాన్‌ను వెనక్కు నెట్టి ఏపీ తొలి స్థానానికి వెళ్లింది. ప్రతి పది లక్షల మందికి సగటున ఏపీలో 961 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌లో ఈ సంఖ్య 877గా ఉంది. తెలంగాణలో ప్రతి పది లక్షల మందికి సగటున 375 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణ కంటే […]

ఏపీకి ఐసీఎంఆర్ అనుమతి
X

కరోనా పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్‌ మిగిలిన రాష్ట్రాల కంటే చాలా ముందుంది. మొన్నటి వరకు తొలి స్థానంలో రాజస్థాన్ ఉండగా ఇప్పుడు రాజస్థాన్‌ను వెనక్కు నెట్టి ఏపీ తొలి స్థానానికి వెళ్లింది. ప్రతి పది లక్షల మందికి సగటున ఏపీలో 961 మందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్‌లో ఈ సంఖ్య 877గా ఉంది.

తెలంగాణలో ప్రతి పది లక్షల మందికి సగటున 375 మందికి మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారు. తెలంగాణ కంటే సగటున ఏపీలో 586 పరీక్షలు అధికంగా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తం 48వేల 34 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తెలంగాణలో ఇప్పటి వరకు 13వేల 200 పరీక్షలు మాత్రమే చేశారు. ఇలా ఇప్పటికే దేశంలోనే పరీక్షల నిర్వాహణలో తొలి స్థానంలో ఉన్న ఏపీకి మరిన్ని ఎక్కువ పరీక్షలు చేసేందుకు ఇప్పుడు మరోమార్గంలో వీలు దొరికింది.

ర్యాపిడ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించేందుకు జాతీయ వైద్య పరిశోధనమండలి ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఇటీవల చైనా నుంచి కేంద్ర ప్రభుత్వం దిగుమతి చేసుకున్న ర్యాపిడ్‌ కిట్లను పలు రాష్ట్రాలకు పంపించారు. అయితే చైనా నుంచి దిగుమతి చేసుకున్న కిట్ల పనితీరు సరిగా లేదని రాజస్థాన్ నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దాంతో రెండు రోజుల పాటు ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించవద్దని ఐసీఎంఆర్‌ ఆదేశించింది.

అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ర్యాపిడ్‌ కిట్లను దక్షిణ కొరియా నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంది. చైనా కిట్లపై అనుమానాల నేపథ్యంలో ఏపీలో కూడా దక్షిణ కొరియా నుంచి తెచ్చిన కిట్లను వినియోగించకుండా ఐసీఎంఆర్‌ ఆదేశాల కోసం ఏపీ ప్రభుత్వం ఎదురుచూసింది.

అయితే దక్షిణ కొరియా కిట్ల నాణ్యతలో ఎలాంటి లోపం లేదని గుర్తించిన ఐసీఎంఆర్‌… వాటిని వినియోగించేందుకు ఏపీ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం తరపున జవహర్ రెడ్డి వివరించారు. ర్యాపిడ్ కిట్ల ద్వారా కమ్యూనిటీ టెస్ట్‌లు వేగవంతమవుతాయి.

First Published:  24 April 2020 1:17 AM GMT
Next Story