Telugu Global
International

ముంబై మరో న్యూయార్క్‌ కాబోతుందా?

మహానగరాలు… ఒకప్పుడు ఆర్థిక ప్రగతి రథ చక్రాలు. ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. కానీ ఇప్పుడు అవే మహానగరాలు కరోనాకు సెంటర్లుగా మారాయి. దేశంలో కేసులు ఎక్కువగా ఐదు నగరాల్లోనే బయపడ్డాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 778 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అక్కడ మొత్తం కేసులు 6,427కి చేరాయి. ఇప్పటివరకూ 283 మంది చనిపోయారు. ఒక్కముంబైలోనే 4,025 మంది కరోనా బాధితులు ఉన్నారు. 24 గంటల్లో ఇక్కడ 522 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. వైరస్‌ బయటపడ్డ నుంచి ఇంత […]

ముంబై మరో న్యూయార్క్‌ కాబోతుందా?
X

మహానగరాలు… ఒకప్పుడు ఆర్థిక ప్రగతి రథ చక్రాలు. ఆర్ధిక వ్యవస్థకు పట్టుగొమ్మలు. కానీ ఇప్పుడు అవే మహానగరాలు కరోనాకు సెంటర్లుగా మారాయి. దేశంలో కేసులు ఎక్కువగా ఐదు నగరాల్లోనే బయపడ్డాయి.

మహారాష్ట్రలో ఒక్కరోజే 778 కేసులు పాజిటివ్‌గా తేలాయి. అక్కడ మొత్తం కేసులు 6,427కి చేరాయి. ఇప్పటివరకూ 283 మంది చనిపోయారు.

ఒక్కముంబైలోనే 4,025 మంది కరోనా బాధితులు ఉన్నారు. 24 గంటల్లో ఇక్కడ 522 మందికి కొత్తగా వైరస్‌ సోకింది. వైరస్‌ బయటపడ్డ నుంచి ఇంత పెద్ద ఎత్తున కేసులు బయటకురాలేదు.

ఆసియాలోనే అతిపెద్ద స్లమ్‌ ఏరియా ధారవి…. ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తోంది. ఇక్కడ 8 లక్షల మంది జీవిస్తున్నారు. ఈ ప్రాంతంలో 214 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. 13 మంది చనిపోయారు.

ముంబైలో లాక్‌డౌన్‌ ఆంక్షలను జనాలు పూర్తిగా ఉల్లంఘించారు. ఇష్టమొచ్చినట్లు రోడ్లపైకి రావడంతో వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమైంది. ప్రస్తుతం భారత్‌లో మొత్తం 22వేలకు చేరువలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ వైరస్‌ బారిన పడి దాదాపు 700 మంది వరకు చనిపోయారు.

ముంబై తర్వాత ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా బయటపడ్డాయి. ఇప్పటివరకూ 2,500 వరకు కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత హైదరాబాద్‌, బెంగళూరు, ఇండోర్‌లో అత్యధికంగా కరోనా కేసులు బయటపడ్డాయి.

ఒకప్పుడు ఉపాధి, వాణిజ్యాలకు కేంద్రాలుగా ఉన్న మెట్రోసిటీస్‌ కరోనా సెంటర్లుగా మారాయి. దీంతో ఇప్పుడు కొత్త ఆలోచన జనాల్లో మొదలైంది. అభివృద్ధి కోసం మెట్రో సిటీలు అవసరమా? పట్టణీకరణపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందా? అనే చర్చ కనిపిస్తోంది.

పల్లెలు ఇప్పుడు సేఫ్‌గా ఉన్నాయి. అక్కడ కరోనా కేసులు లేవు. కానీ అర్బన్, సెమీ అర్బన్‌ ప్రాంతాలు మాత్రమే ఇప్పుడు ఈ మహమ్మారితో విలవిలలాడుతున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే న్యూయార్క్‌ నగరం కూడా ఇప్పుడు కరోనాతో అల్లాడుతోంది. అక్కడ వైరస్ ను కంట్రోల్‌ చేయలేకపోయారు. అభివృద్ధి మొత్తం ఒకే నగరంలో కేంద్రీకృతం అవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో చిన్న చిన్న నగరాలే చింతలేని నగరాలుగా మారే పరిస్థితి ఉంది.

Next Story