Telugu Global
International

సంచలన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికన్ లను కాపాడేందుకు స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు వలసలపై నిషేధం విధిస్తామని ఇటీవల ప్రకటించిన ట్రంప్ దాన్ని నిజం చేశారు. తాత్కాలికంగా అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అన్ని రకాల వలసలను తాత్కాలికంగా రద్దు చేశారు. అమెరికాలో పరిస్థితి చక్కబడిన తర్వాత ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వులపై పునర్‌సమీక్ష చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో శాశ్వత నివాసం […]

సంచలన ఉత్తర్వులపై ట్రంప్ సంతకం
X

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పనిచేశారు. కరోనా నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం నుంచి అమెరికన్ లను కాపాడేందుకు స్థానికులకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు వలసలపై నిషేధం విధిస్తామని ఇటీవల ప్రకటించిన ట్రంప్ దాన్ని నిజం చేశారు. తాత్కాలికంగా అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. అన్ని రకాల వలసలను తాత్కాలికంగా రద్దు చేశారు.

అమెరికాలో పరిస్థితి చక్కబడిన తర్వాత ఇప్పుడు జారీ చేసిన ఉత్తర్వులపై పునర్‌సమీక్ష చేస్తామని ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునే ఉద్దేశంతో వచ్చే వారి వలసలకు అడ్డు కట్ట వేస్తామని ట్రంప్ చెప్పారు.

గ్రీన్ కార్డులకు కూడా తాత్కాలికంగా ట్రంప్ బ్రేక్ వేశారు. గ్రీన్‌ కార్డుల జారీని రెండు నెలల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. వలసేతర వీసాలపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవని అమెరికా ప్రకటించింది.

ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని ఇతర రాజకీయ పక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా ట్రంప్ తగ్గలేదు. ట్రంప్‌ తీసుకుంటున్న ఈ నిర్ణయాల వెనుక రాజకీయ ఎన్నికల కోణం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనా నేపథ్యంలో ఎన్నికలనుంచి గట్టెక్కేందుకు మరోసారి ట్రంప్ లోకల్‌ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారా? అన్న అనుమానాలు వస్తున్నాయి. అమెరికన్ల ప్రయోజనాల కోసం తాను నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పడం ద్వారా అమెరికన్ లను ఆకట్టుకునేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

కరోనాను బూచిగా చూపెట్టి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అవసరమైన చర్యలను ట్రంప్ తీసుకుంటున్నారన్న అభిప్రాయం కూడా ఉంది. నవంబర్ లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అప్పటి వరకు ఈ నిషేధాన్ని ట్రంప్ కొనసాగిస్తారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  22 April 2020 11:35 PM GMT
Next Story