Telugu Global
Cinema & Entertainment

విజయ్ నెక్ట్స్ సినిమా ఇదే

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తోంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత లెక్కప్రకారం హీరో అనే ఆగిపోయిన ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావాలి విజయ్. కానీ ఇప్పుడా ప్రాజెక్టు స్థానంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ కోసం ఓ ప్రేమకథ సిద్ధంచేశాడు శివనిర్వాణ. ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు కూడా పూర్తయ్యాయి. విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమా ఇదే. దిల్ రాజు […]

విజయ్ నెక్ట్స్ సినిమా ఇదే
X

ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. యాక్షన్ ఎలిమెంట్స్ తో వస్తోంది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత లెక్కప్రకారం హీరో అనే ఆగిపోయిన ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావాలి విజయ్. కానీ ఇప్పుడా ప్రాజెక్టు స్థానంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

విజయ్ దేవరకొండ కోసం ఓ ప్రేమకథ సిద్ధంచేశాడు శివనిర్వాణ. ఇద్దరి మధ్య స్టోరీ డిస్కషన్లు కూడా పూర్తయ్యాయి. విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమా ఇదే. దిల్ రాజు బ్యానర్ పై రాబోతోంది ఈ మూవీ. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తారు.

మరి హీరో సినిమా పరిస్థితేంటి? మైత్రీ మూవీ మేకర్స్ సంగతేంటి? ఆ సినిమాను పూర్తిగా పక్కన పెట్టేయాలని నిర్ణయించారు. ఇటు విజయ్, అటు మైత్రీ నిర్మాతలు కలిసి కూర్చొని ఈ ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. అడ్వాన్స్ తో పాటు 10శాతం రెమ్యూనరేషన్ కూడా విజయ్ దగ్గర అలానే ఉంది. శివనిర్వాణ సినిమా పూర్తయిన తర్వాత మైత్రీకి మరో సినిమా చేస్తాడు విజయ్. అటు హీరో సినిమా కోసం ఖర్చుపెట్టిన 5 కోట్లు కృష్ణార్పణం అన్నమాట.

First Published:  21 April 2020 8:01 PM GMT
Next Story