Telugu Global
Cinema & Entertainment

ఆస్కార్ సినిమా నచ్చలేదట... నిద్రొచ్చిందట...

లాక్ డౌన్ వేళ సామాన్యుల నుంచి మొదలుకొని సెలెబ్రెటీల దాకా అందరూ ఇంట్లోనే ఉండి తమకు ఇష్టమైన వ్యాపకాలను చేస్తున్నారు. ఇంట్లో విభిన్నమైన సినిమాలు చూస్తూ.. పుస్తకాలు చదువుతూ.. కుటుంబ సభ్యులతో గడుపుతూ సేద తీరుతున్నారు. రాజమౌళి తాజాగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తన లేటేస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ గురించి.. ఇక తన తరువాత సినిమా ‘మహేష్ బాబు’తో చేయనున్నట్టు రాజమౌళి ప్రకటించాడు. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి ఇటీవల ఆస్కార్ గెలిచిన ‘పారాసైట్’ మూవీ గురించి […]

ఆస్కార్ సినిమా నచ్చలేదట... నిద్రొచ్చిందట...
X

లాక్ డౌన్ వేళ సామాన్యుల నుంచి మొదలుకొని సెలెబ్రెటీల దాకా అందరూ ఇంట్లోనే ఉండి తమకు ఇష్టమైన వ్యాపకాలను చేస్తున్నారు. ఇంట్లో విభిన్నమైన సినిమాలు చూస్తూ.. పుస్తకాలు చదువుతూ.. కుటుంబ సభ్యులతో గడుపుతూ సేద తీరుతున్నారు.

రాజమౌళి తాజాగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. తన లేటేస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్ గురించి.. ఇక తన తరువాత సినిమా ‘మహేష్ బాబు’తో చేయనున్నట్టు రాజమౌళి ప్రకటించాడు.

ఇక ఈ క్రమంలోనే రాజమౌళి ఇటీవల ఆస్కార్ గెలిచిన ‘పారాసైట్’ మూవీ గురించి కూడా తన అభిప్రాయాన్ని ఏమాత్రం దాచుకోకుండా చెప్పాడు. ఆస్కార్ గెలిచిన ఈ సినిమా చూసేటప్పుడు తనకు నిద్ర వచ్చిందని తెలిపాడు. పారాసైడ్ చిత్రం నెమ్మదిగా సాగుతుందని.. ఇలాంటి సినిమా ఆస్కార్ గెలవడం విశేషమేనని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించి నంబర్ 1 చిత్రంగా నిలిచిన ఈ దక్షిణ కొరియా సినిమా రాజమౌళికి నచ్చలేదు. నెమ్మదిగా సాగే డ్రామా ప్రేమకథలను ఆస్వాదించలేమని రాజమౌళి కుండబద్దలు కొట్టాడు.

First Published:  22 April 2020 1:15 AM GMT
Next Story