Telugu Global
Cinema & Entertainment

పుష్పరాజ్ కోసం మరో హీరోయిన్?

పుష్ప సినిమాలో ఇప్పటికే ఓ హీరోయిన్ ను తీసుకున్నారు. పుష్ప సరసన రష్మికను సెలక్ట్ చేశారు. బన్నీ-రష్మికది ఫ్రెష్ కాంబో కాబట్టి స్క్రీన్ పై చూడ్డానికి బాగుంటుంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ కూడా ఎంటరైంది. అవును.. పుష్ప సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని సుకుమార్ గతంలోనే ప్రకటించాడు. ఆ పాత్రకు ఇప్పుడు నివేత థామస్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే పాత్రలు మాత్రమే చేస్తుంది నివేత థామస్. […]

పుష్పరాజ్ కోసం మరో హీరోయిన్?
X

పుష్ప సినిమాలో ఇప్పటికే ఓ హీరోయిన్ ను తీసుకున్నారు. పుష్ప సరసన రష్మికను సెలక్ట్ చేశారు. బన్నీ-రష్మికది ఫ్రెష్ కాంబో కాబట్టి స్క్రీన్ పై చూడ్డానికి బాగుంటుంది. అయితే ఇప్పుడీ ప్రాజెక్టులోకి మరో హీరోయిన్ కూడా ఎంటరైంది. అవును.. పుష్ప సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని సుకుమార్ గతంలోనే ప్రకటించాడు. ఆ పాత్రకు ఇప్పుడు నివేత థామస్ ను తీసుకున్నట్టు తెలుస్తోంది.

పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉండే పాత్రలు మాత్రమే చేస్తుంది నివేత థామస్. ఇలాంటి హీరోయిన్ పుష్ప సినిమా చేయడానికి అంగీకరించిందంటే, ఆ పాత్ర కచ్చితంగా సమ్ థింగ్ స్పెషల్ అయి ఉంటుందంటూ మెగా ఫ్యాన్స్ ఆల్రెడీ చర్చించుకుంటున్నారు. నిజమే.. పుష్ప సినిమాలో నివేత పాత్ర చిన్నదే అయినప్పటికీ ఆమె పాత్ర చాలా బలంగా ఉంటుందని, అందరికీ గుర్తుండిపోతుందని అంటున్నారు యూనిట్ జనాలు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మరోవైపు మేకోవర్ తో బన్నీ, చిత్తూరు యాస ప్రాక్టీస్ చేసి రష్మిక ఇద్దరూ రెడీగా ఉన్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెట్స్ పైకి వెళ్లిపోవాలని అంతా తహతహలాడుతున్నారు.

First Published:  22 April 2020 5:55 AM GMT
Next Story