Telugu Global
International

జియోలో ఫేస్‌బుక్‌ 43వేల కోట్ల పెట్టుబడి

దేశంలో అతిపెద్ద టెలికాం యూనిట్‌గా ఉన్న జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి పెట్టింది. 43వేల 574 కోట్ల రూపాయలను ఫేస్‌బుక్ పెట్టుబడి పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం ఫేస్‌బుక్ అధికారికంగా ప్రకటించింది. ఈ మొత్తంతో జియోలో 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. దేశంలో టెక్నాలజీ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే. జియోలో పెట్టుబడిపై స్పందించిన ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ‘భారత్‌లో ప్రజలకు వాణిజ్య పరమైన అవకాశాలు కల్పించేలా రిలయన్స్‌తో కలిసి పనిచేయనున్నాం. […]

జియోలో ఫేస్‌బుక్‌ 43వేల కోట్ల పెట్టుబడి
X

దేశంలో అతిపెద్ద టెలికాం యూనిట్‌గా ఉన్న జియోలో ఫేస్‌బుక్‌ భారీ పెట్టుబడి పెట్టింది. 43వేల 574 కోట్ల రూపాయలను ఫేస్‌బుక్ పెట్టుబడి పెట్టింది. ఈ విషయాన్ని బుధవారం ఫేస్‌బుక్ అధికారికంగా ప్రకటించింది. ఈ మొత్తంతో జియోలో 9.9 శాతం వాటాను ఫేస్‌బుక్ కొనుగోలు చేసింది. దేశంలో టెక్నాలజీ రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదే.

జియోలో పెట్టుబడిపై స్పందించిన ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ ‘భారత్‌లో ప్రజలకు వాణిజ్య పరమైన అవకాశాలు కల్పించేలా రిలయన్స్‌తో కలిసి పనిచేయనున్నాం. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లకు భారత్‌లో భారీగా వినియోగదారులు ఉన్నారు. ప్రతి ఆర్థిక వ్యవస్థకు చిన్న వ్యాపారాలు చాలా ముఖ్యమైనవి. భారత్‌లో దాదాపు 60 మిలియన్ల చిన్న వ్యాపారాలు ఉన్నాయి. చాలా వరకు ఉద్యోగాలు చిన్న వ్యాపారాలపైనే ఆధారపడి ఉన్నాయి.

కోట్లాది మంది భారతీయులు చిన్న చిన్న వ్యాపారాలు ఆన్‌లైన్‌లో పొందడంలో జియో కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలోనే భారత్‌లో వాణిజ్యపరంగా కొత్త అవకాశాలు కల్పించడానికి జియోతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. చాలా మంది వ్యాపారవేత్తలు వారి బిజినెస్‌ను వృద్ధి చేసుకోవడంలో భాగంగా వినియోగదారులతో కమ్యూనికేట్‌ అవ్వడానికి డిజిటల్‌ పరికరాలు అవసరం ఉంది. ఈ భాగస్వామ్యం కల్పించిన ముఖేశ్‌ అంబానీ, జియో టీమ్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని వ్యాఖ్యానించారు.

ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం వల్ల రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌పై అప్పుల భారం తగ్గుతుంది. వాట్సప్ కూడా ఇటీవల భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు అనుమతి పొందినట్టు సమాచారం. స్మార్ట్ ఫోన్‌ వాడుతున్న వారిలో 80 శాతం మంది వాట్సాప్‌ను వాడుతున్నారు.

First Published:  22 April 2020 12:07 AM GMT
Next Story